భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య డిసెంబర్లో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరుగుతుందంటూ వస్తున్న వార్తలపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టతనిచ్చారు. ఈ సిరీస్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తేల్చిచెప్పారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ ఇటీవల భారత్‌కు వచ్చినప్పుడు బిసిసిఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాతో భేటీ అయ్యాడు. అనంతరం ఇరువురు కలిసి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, డిసెంబర్లో ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య సిరీస్ జరుగుతుందని ప్రకటించారు. అనంతరం షహర్యార్ స్వదేశానికి వెళ్లి, సిరీస్ ఒప్పందంపై సంతకాలు కూడా పూర్తయినట్టు తెలిపాడు. రెండు దేశాలు మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి-20 మ్యాచ్‌లు ఆడతాయని వివరించాడు. టెస్టు సిరీస్ కోల్‌కతాలో మొదలు కావాలని దాల్మియా సూచించాడని అయితే, హోం సిరీస్‌లను తాము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడుతున్నందున, భారత్‌తో సిరీస్ కూడా అక్కడే ఉంటుందని వెల్లడించాడు.
అయితే, ఈ వార్తలను భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ తోసిపుచ్చారు. భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్‌పై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇప్పటి వరకూ ఎవరూ ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదని, తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. ముంబయిపై 2008లో ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. 2012 డిసెంబర్లో భారత్‌లో పాకిస్తాన్ జట్టు మూడు వనే్డలు, రెండు టి-20 మ్యాచ్‌లు ఆడింది. వాటిని మినహాయిస్తే, 2008 నుంచి ఇప్పటి వరకూ ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి సిరీస్‌లు జరగలేదు. ఆసియా కప్ లేదా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలో జరిగే టోర్నీల్లో తప్ప భారత్, పాకిస్తాన్ జట్లు తలపడడం లేదు. ఈఏడాది డిసెంబర్లో రెండు దేశాలు పూర్తి స్థాయి సిరీస్ ఆడతాయని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, కేంద్రం ఈ విషయంపై ఆసక్తి చూపడం లేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more