Virat Kohli says Rohit Sharma is worlds most dangerous batsman | india cricket team

Virat kohli praises rohit sharma worlds dangerous batsman

virat kohli, rohit sharma, worlds dangerous batsman, rohit sharma latest news, rohit sharma updates, rohit sharma career analysis, virat kohli controversy, virat love affair, rohit sharma love affair

virat kohli praises rohit sharma worlds dangerous batsman : "I have never seen a guy, after he gets set, be so dangerous," that's how high Virat Kohli rates his India team-mate Rohit Sharma.

వామ్మో.. రోహిత్ చాలా డేంజర్!

Posted: 06/04/2015 01:56 PM IST
Virat kohli praises rohit sharma worlds dangerous batsman

ఒకే రంగంలో కొనసాగే ఇద్దరు వ్యక్తుల మధ్య వుండే బంధాన్ని పసిగట్టడం అంత తేలికైనా విషయం కాదు. ఎందుకంటే.. వారిమధ్య ఎప్పుడు ప్రేమ చిగురుతుందో, ఎప్పుడు విభేదాలు చోటు చేసుకుంటాయో ఖచ్చితంగా చెప్పలేము. నిన్నటివరకు ప్రాణస్నేహితులుగా మెలిగేవారు.. వున్నట్లుండి శత్రువులుగా మారిపోతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. నిన్నటివరకు రోహిత్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని క్రికెటర్ కోహ్లీ.. ఇప్పుడు అతని గురించి ప్రస్తావిస్తూ ఢంకా బజాయించేస్తున్నాడు.

అత్యంత అరుదైన అర్జున అవార్డు పొందిన టీమిండియా యువ క్రికెటర్ రోహిత్ శర్మపై టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. చాలా కూల్ గా కనిపించే రోహిత్ శర్మ చాలా ప్రమాదకరమైన ఆటగాడని.. అతనిలాంటి క్రికెటర్ ని తాను ఇప్పటిదాకా చూడలేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. రోహిత్ క్రీజులో కుదురుకున్నాడంటే.. ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు కనిపించడం ఖాయమేనని అతడు పేర్కొన్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో రోహిత్ క్రీజులో వుంటే మాత్రం.. ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ మోగుతున్నట్లేనని కోహ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

అంతేకాదు.. రోహిత్ లో గణనీయమైన మార్పు రావడానికి గల కారణాలను కూడా కోహ్లీ ప్రస్తావించాడు. గతంతో పోల్చుకుంటే రోహిత్ లో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని, ముఖ్యంగా టీ20లో రాణించడం రోహిత్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కోహ్లీ వెల్లడించాడు. టీమిండియా జట్టుకు రోహిత్ చాలా కీలకమైన ఆటగాడని అతడు పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : virat kohli  rohit sharma  cricket controversies  

Other Articles