Pink ball ready for day-night Test

Pink ball ready for test debut

Pink ball ready for day-night Test, Pink ball 'ready' for day-night Test debut, Brett Elliot, Cricket, Kookaburra, Pink Ball, Sports, Test cricket, inaugural day-night contest, Australia, November

Kookaburra, the manufacturer of cricket's new pink ball, on Tuesday declared it is Test match ready, if the inaugural day-night contest goes ahead in Australia in November

చరిత్ర తిరగరాసేందుకు గులాబి బంతులు సిద్దం

Posted: 06/17/2015 10:22 PM IST
Pink ball ready for test debut

సర్వసాధారణంగా మనం క్రికెట్ అనగానే తెలుపు రంగు బంతులు, ఎరుపు రంగు బంతులను చూస్తుంటాం. మరీ ముఖ్యంగా వన్డేలలో తెలుపు రంగు బంతులు, టెస్టులలో ఎరుపు రంగు బంతులను వినియోగించడం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం క్రికెట్ లోని అతి పెద్ద ఫార్మట్ టెస్టు క్రికెట్ కు కోత్తగా గులాబి రంగు బంతులను వినియోగించనున్నారు. అదేంటా అని అలోచనలో పడకండి. తాజాగా ఈ క్రికెట్ అతిపెద్ద ఫార్మెట్ ను డే నైట్ (పగలు మరియు రాత్రి) అడేందుకు వీలుగా ఈ గులాబి బంతులను రూపోందించింది తయారీ సంస్థ.

నవంబర్‌ మాసంలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టనున్న డే/నైట్ టెస్టు మ్యాచ్‌ ఆస్టేలియా సిద్దం అవుతుండగా, ఇందుకోసం గులాబీ రంగు బంతులు (పింక్ బాల్స్) సిద్ధం చేసింది క్రికెట్ బాల్స్ తయారీ సంస్ధ కూకబురా. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా, ప్రయోగాత్మకంగా అస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య జరగనున్న డే నైటు మ్యాచ్ కు క్రికెట్ ఆస్టేలియా సన్నాహాలు చేస్తోంది. అడిలైడ్‌, బ్రిస్బేన్‌, హోబర్ట్‌ల్లో ఏదో ఒకటి ఈ మ్యాచ్‌కు వేదికకానుంది. ఈ మ్యాచ్ కు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగితే క్రికెట్ చరిత్రలోనే తొలి డే/నైట్‌ టెస్ట్‌గా నిలిచిపోనుంది.

గత ఐదేళ్లలో కూకబురా గులాబీ బంతిని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు, క్రికెట్‌ ఆస్ర్టేలియాలు పరీక్షిస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో ఈ గులాబీ బంతిని ఉపయోగించవచ్చు. వెస్టిండిస్, దక్షిణాఫ్రికా బోర్డులు కూడా దేశవాళీ టోర్నమెంట్లో ఈ గులాబీ బంతులను ఉపయోగించాయని కూకబురా మేనేజింగ్ డైరెక్టర్ బ్రెట్ ఇలియట్ చెప్పారు. కాగా, రాత్రి సమయంలో గులాబీ బంతి స్పష్టంగా కనిపించదనే విమర్శలు వచ్చాయని, అయితే అలాంటిదేమీ లేదని అనేక పరీక్షల అనంతరం ఈ బంతి స్పష్టంగానే కనిపిస్తుందని నిర్దారించుకున్నామని, కొత్త బంతి ఆరంభంలో స్వింగ్‌ కూడా అవుతుందని బ్రెట్ ఇలియట్ తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brett Elliot  Kookaburra  Pink Ball  Test cricket  

Other Articles