జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒత్తిడిని ఎలా జయించాలో తాను టీమిండియా జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని చూసే నేర్చుకున్నానని అంబటి రాయుడు స్పష్టం చేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడు అజేయ సెంచరీ సాధించి భారత్‌ను గెలిపించాడు. అంబటి రాయుడు వన్డే కెరీర్లో అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడి 124 పరుగులు సాధించి, భారత్‌కు విజయాన్ని అందించడంతో అటు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 255 పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లకు గాను ఏడు వికెట్లను కోల్పోయి 251 పరుగులు చేసింది. కెప్టెన్ చిగుంబుర 101 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అంబటి రాయుడుకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం అంబటి రాయుడు మాట్లాడుతూ ధోని ఆట తీరుని తాను ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండేవాడినని ఇప్పుడు అదే తనకు ఎంతగానో సాయపడిందని తెలిపాడు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఐపీఎల్లో ఇలాంటి సందర్భాల్లోనే తాను బ్యాటింగ్ చేశానని చెప్పుకొచ్చాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more