Sachin Tendulkar Asks Sourav Ganguly to 'Stay Young as Always'

Tendulkar wishes ganguly on his bithday from england

tendulkar wishes ganguly on his bithday from england, Sachin Tendulkar Asks Sourav Ganguly to 'Stay Young as Always' sachin tendulkar, sourav ganguly, stay young as always, sachin tendulkar biography,

Sachin Tendulkar Asks Sourav Ganguly to 'Stay Young as Always'

దాదా నిత్యం యవ్వనవంతుడిలానే వుండు..

Posted: 07/11/2015 08:18 PM IST
Tendulkar wishes ganguly on his bithday from england

సౌరవ్ గంగూళి.. ఇండియన్ క్రికెట్ లో సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టిన బెంగాలీ టైగర్. ఆయనను టీమ్ ఇండియా క్రికెటర్లు మర్యాదపూర్వకంగా దాదా అని బెంగాలీ బాషలో అన్న అంటూ సంబోధించేవారు, అయితే ఆయన సారథ్యంలో మరో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా టీమిండియాకు సేవలు అందించారు. అయితే సడన్ గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్.. మాజీ క్రికెట్ జట్టు సారథి సౌరవ్ గంగూలీకి ఒక సలహా ఇచ్చాడు. అదేంటో తెలుసా..? నిత్యం యువ్వనవంతుడిలానే ఉండమంటూ సూచించాడు. అదేంటి అని ఆలోచనలో పడ్డరా..?

అదేం లేదండీ సౌరవ్ గంగూలి ఇటీవలే 43వ వడిలోకి అడుగుపెట్టాడు. దీంతో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో సచిన్ ఆయనకు విషెస్ పంపించారు. నిత్యం యవ్వనవంతుడిగా వుంటూ అంటూ సూచించారు. వయస్సులో ఎంత ఎదిగినా.., మనస్సు మాత్రం యవ్వనంగా వుండేట్లు చూసుకోవడం ద్వారా.. నిత్యం కొత్త ఆలోచనలు వస్తాయన్నది సచిన్ పరమార్థం కాబోలు. అందుకే ఆయన దాదాకు అలా సూచించారు. ప్రస్తుతం వెకేషన్ పై కుటుంబసమేతంగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సచిన్.. గంగూలీ జన్మదినం రోజు మాత్రం మర్చిపోకుండా విష్ చేస్తారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : achin tendulkar  sourav ganguly  stay young as always  sachin tendulkar biography  

Other Articles