ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తర్వాత, అంతగా ఆకట్టుకుంటున్న ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20(సీఎల్టీ20) టోర్నమెంటు అధికారికంగా రద్దయింది. ఎప్పట్నుంచో రద్దవుతుందని ఊహాగానాలు వస్తున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) బుధవారం సీఎల్టీ20ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20(సీఎల్టీ20) రద్దు చేస్తూ సీఎల్టీ20 గవర్నింగ్ కౌన్సిల్ ధృవీకరించింది. అంతేగాక, ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది' అని భాతర క్రికెట్ నియంత్రంణ మండలి మీడియా అడ్వైజర్ మీడియాకు తెలిపారు.
ఈ టార్నమెంటుకు స్పాన్సర్లు లేకపోవడం కారణంగానే దానిని రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ తెలిపింది. ‘సీఎల్టీ20 గవర్నింగ్ కౌన్సిల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బిసిసిఐ, క్రికెట్ సౌతాఫ్రికా(సిఎస్ఏ), క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ)లు సీఎల్టీ రద్దును ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో సెప్టెంబర్, అక్టోబర్‌లో జరగాల్సిన సీఎల్టీ20 టోర్నీకి ప్రణాళికలు వేయాల్సిన అవసరం లేకుండా పోయింది' అని అడ్వైజర్ చెప్పారు.
సిఎల్టీ20ని 2009లో సిఏ, సిఎస్ఏలతో కలిసి బిసిసిఐ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజాదరణ కోల్పోతున్నందున ఈ టోర్నీని రద్దు చేయాలని సీఎల్టీ20 గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. బిసిసిఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఇండియాలో నిర్వహిస్తున్న ఐపిఎల్, ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న బిగ్ బాష్ లీగ్, దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తున్న స్లామ్ టీ20ల నుంచి సీఎల్టీ20కి పోటీ ఎదురవుతోందన్నారు. ఆటగాళ్లకు మంచి అవకాశంగా ఉన్న సీఎల్టీ20కి అభిమానుల నుంచి తగిన ఆదరణ లభించడం లేదని అన్నారు.
తమ వాణిజ్య భాగస్వాములందర్నీ సంప్రదించిన తర్వాతే సీఎల్టీ20 రద్దుపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రద్దుకు సంబంధించిన ఇతర వ్యవహారాలు తర్వలోనే ముగించడం జరుగుతుందని తెలిపారు. స్పాన్సర్లు లేకుండా ఈ టోర్నిని నిర్వహించడం కష్టమని అభిప్రాయపడిన బోర్డు, ఈ మేరకు ఈ టోర్నీని రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. సీఎల్ టీ20 స్థానంలో ఐపీఎల్ లోని టాప్ 4 జట్లతో మిని ఐపీఎల్ నిర్వహిచాలని బిసిసిఐ బావిస్తున్నట్లు సమాచారం. బేబి ఐపిఎల్ పేరుతో టోర్నిని నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా వున్నట్లు తెలుస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more