జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. కేదార్ జాదవ్ (87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 105 నాటౌట్) సెంచరీతో కదం తొక్కడంతో.. ఆఖరి, ఐదో వన్డేలో భారత్ 83 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. మూడవ చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియా.. అతిధ్య జట్టు ముందు 277 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత యాభై ఓవర్లలో టీమిండియా ఐదు విక్కెట్ల నష్టానికి 276 పరుగులు సాధించింది. రహానే సేన నిర్ధేశించిన లక్ష్య చేదనలో జింబాబ్వే తడబడింది.
మసకద్జా (7)ను అవుట్ చేసి మోహిత్.. జింబాబ్వే పతనాన్ని ప్రారంభించాడు. తర్వాత చిబాబా ఆదుకునే ప్రయత్నం చేసినా.. అతనికి సహచరుల మద్దతు లభించలేదు. చకబ్వా (27), కెప్టెన్ చిగుంబుర (10), ముతుంబమి (22), రజా (13) ఆదుకోలేకపోయారు. ఇక మద్జివా (3) ఆఖరి వికెట్‌గా అవుట్ కావడంతో జింబాబ్వే కథ ముగిసింది. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్న మరోమారు తన సత్తాను చాటాడు. పది ఓవర్లకు గాను 55 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్, హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు విక్కట్లు సాధించారు. విజయ్ మరో వికెట్ ను పడగోట్టాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. టాప్ ఆర్డర్ నిరాశపర్చించి. ఈ దశలో కేదార్ జాదవ్-మనీష్ పాండే ఐదో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు కోలుకుంది. కెప్టెప్ అజింక్యా రహేనే 25 పరుగుల వద్ద 15 పరుగుల వ్యక్తిగత స్కోరుతో వెనుదిరగగా, క్రితం మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించిన మురళీ విజయ్ కూడా 33 పరుగులకే ఔటయ్యి వెనుదిరిగాడు. ఈ క్రమంలో 50 పరుగుల లోపు రెండు విక్కెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను మరింతగా కుంగదీశారు జింబాబ్వే బౌలర్లు. అ తరువాత వచ్చిన మనోజ్ తివారి కేవలం పది పరుగులకే వెనుదిరగడంతో రహానే సేన కష్టాల ఊబిలోకి దిగింది. ఆ తరువాత వచ్చిన రాబిన్ ఉత్తప్ప కాస్త పరువా లేదనిపించినా.. ఆయన కూడా 31 పరుగులు వ్యక్తిగత స్కోరువద్ద పెవిలియన్ దారిపట్టాడు, దీంతో కేవలం 82 పరుగలకే నాలుగు టాప్ అర్ఢన్ వికెట్లను కోల్పోయిన భారత్ ను మనీష్ పాండే, కేదార్ జాదవ్ లు అదుకున్నారు.
కేదర్ జాదవ్ 87 బంతులలో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో చెలరేగి 105 పరుగులను సాధించి అజేయంగా నిలువగా, మనీష్ పాండే నాలుగు ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 71 పరుగులు సాధించి నాలుగో వికెట్ కు 144 పరుగులు బాగస్వామాన్ని నెలకోల్పారు. కాగా జింబాబ్వే బౌలర్లలో బువిల్లీ మాడ్జీవా రెండు విక్కెట్లు తీయగా, చమ్మూ చిబాబ్బా, మసకడ్జా, యుసేయా చెరో వికెట్ సాధించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more