జింబాబ్వే జట్టుతో హరారే వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో భారత్ తన దూకుడును ప్రదర్శించింది. అధిత్య జట్టుపై విజయాన్ని కైవసం చేసుకుంది. వన్డే సీరిస్ ను కోల్పోయిన జింబాబ్వే జట్టు కనీసం టీ-20 సీరిస్ నైనా గెలిచి పరువు దక్కించుకోవాలని యత్నించగా.. దానిని కూడా రహానే సేన పటాపంచలు చేస్తూ తొలి టీ-20లో 54 పరుగులతో విజయాన్ని నమోదు చేసుకుంది. ముందుగా టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది.
భారత్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే చతికిల పడింది. కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లుగా దిగిన మసకడ్జ(28), ఛిబాబా(23)లు కాస్త ధాటిగా ఆడి మెరుపులు మెరిపించారు. ఆ తర్వాత టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు క్రమంగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కవొంట్రీ 10, చిగుంబుర 1, రజా 10, ఎర్విన్ 2, క్రెమెర్ 9 పరుగులకే వికెట్లు పారేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఉట్సెయ(14), మడ్జివ(14) ఫోర్లు, సిక్సర్లు కొట్టినా అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లు పూర్తి అయ్యేసరికి జింబాబ్వే.. ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దీంతో 54 పరుగుల తేడాతో టీంఇండియా విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు, హర్భజన్ సింగ్ రెండు, మోహిత్ శర్మ ఒక్క వికెట్ తీసుకున్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన టీంఇండియా ఓపెనర్లు రహానే, విజయ్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించిన తర్వాత విజయ్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అవ్వగా, , కాసేపటికే రహానే 33 పరుగుల వద్ద ఔటయ్యారు. ఆ తరువాత వరుసగా మూడు వవికెట్లు కొల్పియినా టీమిండియాలో.. వన్డేలలో రాణించలేదని విమర్శలను ఎదుర్కోన్న మిడిల్ అర్డర్ బ్యాట్స్ మెన్ లో రాబిన్ ఊతప్ప నిలకడి నాటౌట్ గా నిలచి 39 పరుగులు చేశారు. దీంతో టీమిండియా పటిష్టమైన స్కోరును చేయగలిగింది. జింబాబ్వే బౌలరల్లో క్రిస్ మోఫు మూడు, గ్రేమీ క్రీమర్ ఒక్క వికెట్ తీసుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more