Sania Mirza | Sri Lanka | Shoaib Malik

Sania mirza in sri lanka to cheer for husband shoaib malik

sania mirza, shoaib malik, srilanka, colombo, Wimbledon, Tennis

after a long gap sania mirza and shoaib malik enjoy the srilanka tip. cheered for husband Shoaib Malik during the contest. Fresh from the Wimbledon 2015 win, Sania is off tennis for a bit. She seems to have finally got some time to be with her husband.

జాలీగా సానియామీర్జా జోడి.. శ్రీలంకలో జోరుగా షికారు

Posted: 07/20/2015 06:19 PM IST
Sania mirza in sri lanka to cheer for husband shoaib malik

హైదరాబాదీ టెన్నిస్ బ్యూటీ సానియా మిర్జా...తన భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను చాలా రోజుల తర్వాత కలిసింది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. మూడో వన్డే సందర్భంగా సానియా మిర్జా స్టేడియంలో తళుక్కుమంది.తన భర్త షోయబ్ మాలిక్ ను సపోర్ట్ గా గ్యాలరీలో కేరింతలు పెట్టింది. మ్యాచ్ అనంతరం ఇద్దరూ కలిశారు. సానియా, షోయబ్...ఇండో పాక్ స్పోర్ట్స్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎన్నో కాంట్రవర్సీలను ఫేస్ చేశారు. పెళ్లైన దగ్గర్నుంచీ...గత ఏడాది దాకా ఈ జోడీని వివాదాలు వెన్నాడాయి. సానియా జాతీయతపై గత సంవత్సరం దుమారం చెలరేగడంతో టెన్నిస్ బ్యూటీ కంటతడి కూడా పెట్టింది. సరిగ్గా అదే ఏడాది భర్త షోయబ్ మాలిక్ ఫాంలో లేక సతమతమయ్యాడు. ఇక ఇంగ్లండ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోపీ తర్వాత పాకిస్థాన్ జట్టు ఇతడిని తప్పించింది. ఆ తర్వాత కరేబియన్ లీగ్ లో నోటికి పనిచెప్పి వివాదంలో చిక్కుకున్నాడు.

ఐతే ఈ జంట విడివిడిగా ఉండి ఆటపైనే ఫోకస్ చేయడం వర్కవుట్ అయింది. ఇద్దరూ కలుసుకోకపోవడంతో ..వీళ్లు బ్రేకప్ అయ్యారంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఐనా సరే వాటిని పట్టించుకోకుండా షోయబ్ మాలిక్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో దుమ్మురేపి..టచ్ లోకి వచ్చాడు. ఏడాది తర్వాత మళ్లీ జట్టులో చోటు సంపాదించాడు. సానియా కూడా పట్టుదలతో ఆడింది. ఐతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన తర్వాత సానియా మిర్జా ...టాప్ గేర్ లో దూసుకుపోతోంది. వివాదాలను అస్సలు పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఏడాది కాలంగా సూపర్ ఫాంలో ఉంది. ప్రతీ టోర్నీలో టైటిళ్లు గెలుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మార్టినా హింగిస్ తో కలిసి వింబుల్డన్ మహిళల డబుల్స్ విజేతగా నిలిచింది. సానియా కెరీర్ లో తొలిసారిగా మహిళల గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుని ..అదుర్స్ అనిపించింది.

ఇక షోయబ్ మాలిక్ 2015 మేలో పాకిస్థాన్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు...రీ ఎంట్రీలో జింబాబ్వేతో జరిగిన వన్డేలో సెంచరీ చేసి తనలో పస తగ్గలేదని నిరూపించాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో సూపర్ ఫాం కనబరిచాడు. సీనియర్లు లేక సతమమతమవుతున్న పాకిస్థాన్ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. భర్తకు దూరంగా ఉండి విరహవేదన అనుభవించినప్పటికీ...తాను సాధించిన విజయాలను చూసి సానియా గ్రేట్ గా ఫీలవుతోంది. వరుస ట్రోఫీలు సాధించడంతో ప్రధాని మోడీ సహా, దేశమంతా సానియాను ప్రశంసిస్తోంది. విమర్శించిన వాళ్లు సైతం పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక షోయబ్ మాలిక్ ను కూడా పాకిస్థాన్ మీడియా ఓ రేంజ్ లో ప్రశంసిస్తోంది. మొత్తానికి చాలా కాలం దాంపత్య జీవితానికి దూరంగా ఉన్న సానియా, షోయబ్ జోడీ...శ్రీలంకలో షికార్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  shoaib malik  srilanka  colombo  Wimbledon  Tennis  

Other Articles