BCCI announces ICC World T20 2016 venues and Eden Gardens to host final | T20 World Cup

Bcci announces icc world t20 2016 venues india

bcci, t20 worldcup, t20 2016 venues, kolkata, eden gardens, t20 worldcup venues, icc world cup t20, mumbai city, delhi, bcci secretary anurag thakur

BCCI announces ICC World T20 2016 venues India : The Board of Control for Cricket in India announced the venues that will host the men’s and women’s ICC World T20 2016. The big-ticket event will be played in India from 11th-3rd April, 2016.

టీ20 వరల్డ్ కప్-2016 వేదికలు ప్రకటించిన బీసీసీఐ

Posted: 07/21/2015 04:48 PM IST
Bcci announces icc world t20 2016 venues india

వన్డే ప్రపంచకప్ తర్వాత మరో మెగా ఈవెంట్ అయిన టీ-20 వరల్డ్ కప్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ ఇండియాలోనే వివిధ నగరాల్లో మార్చ్ 11 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది. కోల్ కతా, బెంగుళూరు, చెన్నై, ధర్మశాల, మొహాలీ, ముంబై, నాగ్ పూర్, ఢిల్లీ తదితర నగరాల్లో టీ20 మ్యాచులు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఈవెంట్ వివరాలు విడుదల అవ్వగానే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టీ-20 వరల్డ్ కప్ వేదికల ప్రకటన విడుదల చేసిన సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘క్రికెట్ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నందుకు బీసీసీఐ ఎంతో గర్విస్తోంది. టోర్నీ కోసం ప్రకటించిన వేదికలన్నీ బ్రహ్మాండమైన మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చాయి. ఈ ప్రకటనతోనే టీ-20 వరల్డ్ కప్ సన్నాహాలు మొదలైనట్టే. ఫ్యాన్స్కు, జట్టకు ఈ వరల్డ్ కప్ మరుపురాని అనుభవంలా మిగిలిపోవాలని కోరుకుంటున్నా’ అని ఆయన అన్నారు. మరోవైపు ఈ ప్రకటన విడుదలైన నేపథ్యంలో క్రీడాకారులు ఈ టోర్నీ కోసం కసరత్తులు చేసే దిశగా పావులు కదుపుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc world cup t20  kolkata eden gardens  bcci  

Other Articles