Political tension puts India-Pakistan series in doubt

India s cricket series with pakistan in jeopardy says bcci

India's cricket series with Pakistan in jeopardy, says BCCI, Political tension puts India-Pakistan series in doubt, delhi, wake, gurdaspur, terror attacks, anurag, thakur, BCCI secretary anurag, thakur, cricket, terror, india, scheduled, series, pakistan, december, internal, security, BCCI, saurav ganguly, india pak cricket series, India-Pakistan series

In the wake of the Gurdaspur terror attacks on Monday, Anurag Thakur, the BCCI secretary told "Cricket and terror cannot go hand in hand.

ఇండియా పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ హుళ్లక్కే..!

Posted: 07/28/2015 10:34 PM IST
India s cricket series with pakistan in jeopardy says bcci

పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉగ్రవాదులు చొరబడి భీభత్సం సృష్టించడంతో పోలీసులు, ఖైదీల మరణాలకు కారణం కావడంతో గత కోన్నాళ్లుగా ఎదురుచూస్తున్న భారత్ పాక్ క్రికెట్ సిరీస్ మళ్లీ హుళ్లక్కయ్యింది. రైలు ప్రమాదం సంభవించాలని రైల్వే ట్రాకుపై బాంబులను అమర్చిన ఉగ్రవాదులు గురుదాస్ పూర్ పోలిస్ స్టేషన్ లోకి చోరబడి.. మారణహోమం సృష్టించారు. అయితే ఆ ఉగ్రవాదులందరూ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులేనని స్పష్టం కావడంతో మరోమారు దాయది చిత్తశుధ్దిపై సందేహాలు అలుముకున్నాయి

ఇటీవలే పాక్ క్రికెట్ బోర్డు పెద్దలు భారత్ పాక్ క్రికెట్ సిరీస్ ఈ ఏడాది చివర్లో ఉండవచ్చని పేర్కోన్నారు. అయితే అందుకు రాజకీయ పరమైన అడ్డంకులు తొలగిపోవాల్సి వుందని బిసిసిఐ అభిప్రాయపడింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా సిరీస్ కష్టమేనని కూడా బిసిసిఐ పెద్దలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఈ విషయమై స్పందిస్తూ.. క్రికెట్, ఉగ్రవాదం రెండు సమాంతరంగా వెళ్లవని తేల్చిచెప్పారు. క్రికెట్ కన్నా ముందు దేశ భద్రత ముఖ్యమని చెప్పుకోచ్చారు. దీంతో ఇక పాకిస్థాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఉండకపోవచ్చని భారత క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

అటు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూళీ కూడా బిసిసిఐ నిర్ణయాన్ని సమర్థించారు. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న అన్ని ఉగ్రవాద కార్యకలాపాలు అంతం చెందిన తరువాతే భారత్ పాక్ క్రికెట్ సిరీస్ ఏర్పాటు చేయాలని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయిన తరువాతే ఇరు దేశాల మధ్య ఎలాంటి క్రికెట్ పోటీలకైనా భారత్ సిద్దమని చెప్పారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సిరీస్ ఉండబోదని గంగూలీ స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడేదాకా పాక్ క్రికెట్ బోర్డుతో సంబంధాల పునరుద్దరణ ఉండదని పేర్కోన్న బిసిసిఐతో తాను ఏకీభవిస్తున్నట్లు గంగూలీ తెలిపాడు. దీంతో భారత్ పాక్ క్రికెట్ సిరీస్ పై చిగురించిన ఆశలు అన్ని అడియాశలుగా మారాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India-Pakistan series  BCCI  Anurag Thakur  saurav ganguly  

Other Articles