ban on sreesanth and Ankeet chavan stays thakur

Bcci refuses to revoke ban on cricketers

S Sreesanth, Neeraj Kumar, Kerala Cricket Association, IPL spot-fixing, IPL, Tihar Jail, pacer S Sreesanth, BCCI Secretary Anurag Thakur, favourable decision, cricket betting racket, underworld don Dawood Ibrahim, dawood aide Chhota Shakeel, Cricket, IPL spot fixing-case, BCCI, S Sreesanth, Anurag Thakur, Ankeet Chavan, Ajit Chandila

The BCCI on Wednesday made it very clear that it was not having second thoughts on revoking the ban on former India pacer S Sreesanth and spinner Ankeet Chavan in the wake of a Delhi Court dropping all charges against them in the IPL 2013 spot-fixing case.

క్రమశిక్షణా చర్యలు కొనసాగుతాయి.. ఆ క్రికెటర్లకు బీసీసీఐ షాక్..

Posted: 07/29/2015 07:30 PM IST
Bcci refuses to revoke ban on cricketers

ఢిల్లీలోని పాటియాల కోర్టు తీర్పుతో ఊరట లభించిన క్రికెటర్లకు బీసీసీఐ మాత్రం చేదు వార్తను అందించింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో నిర్దోషిగా బయటపడి.. మళ్లీ ఇండియా జట్టులోకి పునరాగమనం చేయాలన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్ ల ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది. వీరిపై అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించబోమని బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయంలో రెండో ఆలోచనే లేదని వెల్లడించింది. శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ తేల్చి చెప్పేశారు. ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అమల్లోనే ఉంటుందన్నారు.
 
చట్టపరమైన చర్యలకు, బోర్డు తీసుకున్న క్రమశిక్షణ చర్యలకు సంబంధం ఉండదని ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేరళ క్రికెట్ సంఘం చేసిన విన్నపాన్ని బీసీసీఐ తిరస్కరించింది. అలాగే అంకిత్ చవాన్, అజిత్ చాండిలా విషయంలోనూ బీసీసీఐ క్రమశిక్షణ నిర్ణయం అమల్లో ఉంటుందని ఠాకూర్ వెల్లడించారు. కాగా, స్పాట్ ఫిక్సింగ్ కేసుతో నిర్దోషిగా బయటపడిన శ్రీశాంత్ బీసీసీఐ కూడా తనపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని కోటి ఆశలతో ఎదురుచూసిన శ్రీశాంత్ కు బీసీసీఐ నుంచి షాక్ తినే రెస్పాన్స్ వచ్చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  IPL spot fixing case  BCCI  S Sreesanth  Anurag Thakur  Ankeet Chavan  Ajit Chandila  

Other Articles