ఆస్ట్రేలియా కెప్టెన్ మైకిల్ క్లార్క్ దృష్టి అమాంతం మరోదానిపైకి మరలినట్టువుంది. తాను ఎక్కడున్నాను, ఎం మాట్లాడుతున్నాను అన్న అంశాన్ని కూడా మర్చిపోయిన క్లార్క్ యాదృశ్చికంగా అలా అన్నాడు.. లేక కావాలని అలా అన్నాడో తెలియదు కాని.. తన ముందు వున్న మీడియా వారిని మాత్రం కడుపుబ్బనవ్వించాడు. అంతేకాదు.. తాను నోరుజారానని తెలుసుకున్నాక తన మాటాలకు తానే ఉండబట్టలేక నవ్వేశాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఆడుతున్న మూడో టెస్టుకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాడు.
తమ జట్టు ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించేందుకు తమ వద్దునున్న అధునాతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించడంతోనే సెక్స్ అవుతున్నామని చెప్పుకోచ్చాడు. అదేంటి అంటారా..? అక్కడ వాడాల్సిన పదం అది కాదే అనుకుంటున్నారా..? అవును నిజమే సక్సెస్ అనేందుకు బదులు ఆయన సెక్స్ అని వ్యాఖ్యానించాడు. అంతే ఆయన మాటాలు విన్న మీడియా ప్రతినిధులు నవ్వడం ప్రారంభించడంతో ఆయన కూడా తన తప్పును తెలుసుకుని నవ్వడం ఆరంభించాడు. ఎంతగా తన నవ్వవును అదుపు చేసుకుందామనుకున్నా అతని వల్ల కాలేదు. దీంతో బిగ్గరగానే నవ్వేశాడు. ఈ విషయాన్ని గమనించిన కార్ల్క్ తనతో మరోసారి మీడియా ప్రతినిధులు ఇబ్బంది పడ్డారంటూ వ్యాఖ్యనించాడు.
కాగా క్లార్క్ ఇలా నోరుజారడం ఇది మొదటి సారి మాత్రం కాదు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో క్లార్ ను ఇలానే ఓ మీడియా ప్రతినిధి సెక్స్, సక్సెస్ మధ్య సంబంధం లేని ప్రశ్నలతో క్లార్ ని ఇబ్బంది పెట్టగా, ఇప్పుడు ఆయన మీడియా ప్రతినిధులను ఇబ్బందులకు గురిచేశాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more