పాకిస్థాన్ కరాచీలో మరోమారు క్రికెట్ క్రీడాకారుడిపై కాల్పుల కలకలం రేపాయి. శ్రీలంక క్రికెట్ జట్టుపై గతంలో ఆరేళ్ కిందట జరిగిన కాల్పుల తరువాత.. తమ సొంత దేశానికి చెందిన క్రికెటర్లపై కాల్పులకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారధి వసిమ్ అక్రమ్ పై గుర్తు తెలియని అగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోగలిగారు. ఆయన కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది.
కాల్పుల ఘటన తరువాత మీడియాతో మాట్లాడిన వసీమ్ అక్రమ్ తనపై గుర్తు తెలియని అగంతకులు కాల్పులు జరిపారని చెప్పారు. తన నివాసం నుంచి పాకిస్థాన్ రాజధాని కరాచీలో వున్న నేషనల్ క్రికెట్ స్టేడియానికి వస్తున్న మార్గంలో షా ఫైసల్ రోడ్డలో కర్సాజ్ వద్ద తన కారును వెనకగా వచ్చిన మరో కారు డీ కోనిందని చెప్పారు. కాగా అటుగా వచ్చిన మారో కారులోంచి అగంతకుడు తనపై కాల్పులకు తెగబడ్డాడని చెప్పాడు. అయితే కాల్పుల ఘటనను నుంచి తృటిలో తప్పించుకున్న నని అక్రమ్ తెలిపాడు.
తనపై కాల్పులకు తెగబడిన వ్యక్తి ప్రభుత్వ అధికారి మాదిరిగా వున్నాడని, అతను అందుకు వినయోగించింది కూడా ప్రభుత్వానికి చెందిన కారునేనని వసీం అక్రమ్ తెలిపాడు. కారు రిజిస్ట్రేషన్ నెంబరు సహా అన్ని వివరాలను తాను పోలీసుకులకు చెప్పినట్లు తెలిపారు. పాకిస్థాన్ కు చెందిన యువ క్రికెటర్లకు తాను బౌలింగ్ లోని మెళకువలు తెలిపేందుకు గాను 13 రోజుల పాటు క్యాంప్ ను నిర్వహించేందుకు వసీహ అక్రమ్ తో ఇటీవలే పాకిస్థాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని జీర్ణించుకోలేని వారే ఈ దాడికి పాల్పడి వుంటారని అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more