Confident of playing for India in 2019 ICC World Cup: Sreesanth

I want to play in the 2019 world cup sreesanth

S Sreesanth, Oommen Chandy, BCCI, IPL, 2013 spot fixing case, Kerala Cricket Association, 2019 world cup, Sree Krishna Temple in Guruvayoor, icc cricket world cup, Indian Premier League, IPL spot-fixing, Rajasthan Royals, Sreesanth

Former Indian pacer S Sreesanth expressed confidence in being able to represent his country in the 2019 World Cup

వరల్డ్ కప్ నాటికి జట్టులో చోటు సంపాదిస్తా..

Posted: 08/05/2015 06:49 PM IST
I want to play in the 2019 world cup sreesanth

ఎట్టి పరిస్థితుల్లో 2019 వరల్డ్‌ కప్‌కు భారత జట్టులో చోటు సంపాదిస్తానని కేరళ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు తనకు టీమిండియాలో చోటు సంపాదించడమే లక్ష్యమని చెబుతూ వచ్చిన శ్రీశాంత్..  బిసిసిఐ కళంకిత క్రికెటర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయకపోవడంతో.. నిరాశ చెందిన ఆయన.. తనపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ త్వరలో ఎత్తివేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బిసిసిఐకి మంచి మనస్పు వుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ మేరకు బిసిసిఐ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రానప్పటికీ తాను మాత్రం టీమిండియా జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

కుటుంబసమేతంగా ఆయన కేరళలోని గురువాయూర్ లో నెలకొన్న శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయన ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. వరల్డ్ కప్ నాటికి తాను టీమిండియా తుది జట్టులో స్థానం సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేసిన ఆయన సినిమా షూటింగ్ లు, మ్యూజిక్ అల్బమ్ లను దూరంగా పెట్టానన్నారు. తాను అంకితభావంతో క్రికెట్ సాధనలో పాల్టోంటున్నానని చెప్పారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసును కొట్టివేస్తూ ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చిన విషయం విధితమే. దీంతో శ్రీశాంత్‌ మళ్లీ తన కేరీర్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : S Sreesanth  BCCI  2019 world cup  2013 spot-fixing case  Kerala Cricket Association  

Other Articles