Nottinghamshire’s Brendan Taylor found asleep in someone’s car after celebrating win

Brendan taylor found asleep in someone s chevrolet

Nottinghamshire batsman, former Zimbabwe captain, Brendan Taylor, celebrations, Royal London Cup, victory, Durham, Nottinghamshire, Brendan Taylor, County Championship Division One, Cricket, Sport

The Nottinghamshire batsman and former Zimbabwe captain, Brendan Taylor, was discovered asleep in someone’s car after celebrations of his side’s Royal London Cup victory over Durham got a bit out of hand.

మధ్యం మత్తులో ఆ క్రికెటర్ ఏం చేశాడో తెలుసా..?

Posted: 08/28/2015 08:13 PM IST
Brendan taylor found asleep in someone s chevrolet

మత్తు మైకంలోకి జారితే.. ఇక అది మనకు సినిమా చూపించడం ఖాయమని, అందుకే దానితో ఎంత జాగ్రత్తగా వుంటే అంత మంచిదని చెబుతుంటారు పెద్దలు. ఈ విషయం తెలిసో, తెలియకో ఓ ప్రముఖ క్రికెటర్ ఫుల్ గా మందుకోట్టాడు.  మద్యం మత్తుకు మన, పర భేదమే లేదు. ఎవరు దానిని కోరుకుంటారో.. వారిని తన కౌగిలిలో బంధించి. మైకంలోకి తీసుకెళ్తుంది. అలానే ఆ క్రికెటర్ ను కూడా తన కౌగిలిలోకి తీసుకుని.. అమాతం నిద్రపుచ్చింది. అయితే తనకు చెప్పలేనంతగా మత్తులోకి జారుకున్న క్రికెటర్ తన నిద్రపోవడానికి ఎం చేశాడో తెలుసా..? ఇంతకీ ఆ ప్రముఖ క్రికెటర్ ఎవరు..? అంత ఫుల్ గా మద్యం ఎందుకు కొట్టాల్సి వచ్చింది..?

జింబాబ్వే నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ గా బ్రెండన్ టేలర్ కు పేరుంది. వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న నాటింగ్ హామ్ షైర్ రాయల్ లండన్ వన్డే కప్ క్వార్టర్ ఫైనల్లో డుర్హాంపై జయభేరి మోగించింది. ఆ సందర్భంగా నాటింగ్ హామ్ షైర్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విజయోత్సవం అంటే మద్యం వెల్లువెత్తడం సాధారణ విషయమే!

టేలర్ కూడా పీకలదాకా తాగి, కిక్కు తలకెక్కడంతో అక్కడ కనిపించిన ఓ షెవర్లే మాటిజ్ కార్లో పడుకుని నిద్రపోయాడు. కారు సొంతదారు మైకేల్ విటేకర్ డోర్ తెరిచి చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఎవరో వ్యక్తి కారు వెనుక సీట్లో పడుకుని గుర్రు పెడుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఓ క్రికెటర్ అని విటేకర్ కు తెలియదు. పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చిన తర్వాత అతడో స్టార్ క్రికెటర్ అని తెలియడంతో విటేకర్ ఆశ్చర్యపోయాడు. ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్ మన కార్లో పడుకుని ఉంటే ఎలా ఉంటుంది? అంటూ ఆ ఘటనను ఓ తమాషాగా పేర్కొన్నాడు. అటు, బ్రెండన్ టేలర్ కూడా జరిగిన దానికి క్షమాపణలు తెలిపి తన గౌరవం నిలుపుకున్నాడు.  

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nottinghamshire  Brendan Taylor  County Championship Division One  Cricket  Sport  

Other Articles