స్వదేశంలో జరిగిన రెండు వరుస సిరిస్ ఓటములు శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌తో పాటుగా అంతకు ముందు పాకిస్థాన్ తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల ఓటములను తాను నైతిక బాధ్యత వహిస్తూ శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి మర్వన్ ఆటపట్టు రాజీనామా చేశాడు. గత మూడు నెలల్లో శ్రీలంక వరుసగా పాకిస్థాన్, భారత్ చేతిలో టెస్టు సిరిస్‌ను ఓటమి పాలైవ్వడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆటపట్టు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే భారత్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1 తేడాతో భారత్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుస సిరిస్ ఓటములకు బాధ్యత వహిస్తూ కోచ్ మర్వన్ ఆటపట్టు రాజీనామా చేశాడు.
ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్ తాత్కాలిక అధ్యక్షుడు సిదాత్ వెట్టిముని తెలిపాడు. ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న చండికా హతురసింఘేను కొత్త కోచ్‌గా నియమించాలనే ఆలోచనలో శ్రీలంక బోర్డు ఉంది. కోచ్ చండికా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ వరల్డ్ కప్ క్వార్టర్స్‌కు వెళ్లడమే కాకుండా పాకిస్ధాన్, భారత్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డే సిరిస్‌లలో చక్కగా రాణించింది. శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ గా గత ఏడాది అక్టోబర్ లో ఆటపట్టు బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా ఏడాది కూడా తిరగకముందే.. ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతకు ముందు శ్రీలంక జట్టుకు 2011 నుంచి బ్యాటింగ్ కోచ్ గా, ఫీల్డింగ్ కోచ్ గా ఆటపట్టు సేవలందించారు. శ్రీలంక మాజీ కెప్టెన్ గా సేవలందించిన ఆటపట్టు..లంక తరఫున 90 టెస్టులు, 268 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5502, వన్డేల్లో 8529 పరుగులు సాధించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more