can srinivasan attend our meetings bcci asks supreme court

Bcci takes legal opinion on n srinivasan

india cricket, cricket india, bcci, bcci india, bcci cricket, cricket bcci, n srinivasan, srinivasan, srini, BCCI, Chennai Super Kings, IPL, SC, Supreme court, cricket newsipl fixing, cricket news, cricket

The Board of Control for Cricket in India on Saturday moved Supreme Court to seek clarity over N Srinivasan's role in the board.

శ్రీనివాసన్ పై స్పష్టత కోరుతూ సుప్రీంకు వెళ్లిన బీసీసీఐ

Posted: 09/12/2015 06:25 PM IST
Bcci takes legal opinion on n srinivasan

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ విషయమై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) శనివారం నాడు సుప్రీంకోర్టును సంప్రదించింది. మాజీ అధ్యక్షుడి హోదాతో పాటుగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో శ్రీనివాసన్ బీసీసీఐ అధికారిక సమావేశాలకు హాజరు కావచ్చా..? లేదా..? అనే విషయంపై స్పష్టత కోసం బోర్డు సభ్యులు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సలహాను కోరారు. నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఆయనకు చెందిన ఇండియా సిమెంట్స్ వాటాలు ఉండటంతో పాటు గతంతో సుప్రీం వెలువరించిన తీర్పులో ఎన్ శ్రీనివాసన్ బిసిసిఐ కార్యకలాపాల నుంచి దూరంగా వుండాలని కూడా అదేశించిన తరుణంలో స్పష్టత కోరుతూ బిసిసిఐ సభ్యలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టును ఆశ్రయించారు.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో నిషేధానికి రెండు జట్లపై ఐపీఎల్ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించడానికి గత నెలలో సమావేశం ఏర్పాటు చేయగా.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున శ్రీని హాజరుకావడంతో సమావేశం రద్దయింది. ఎందుకంటే చెన్నై ఫ్రాంచైజీకి శ్రీని కంపెనీ ఇండియా సిమెంట్స్ వాటాలను ఎలా అమ్మిందన్న దానిపై స్పష్టతలేని కారణంగా కొంత సందిగ్ధత నెలకొందన్నది వాస్తవం. ఫిక్సింగ్ ఆరోపణలు రుజువైనందున జస్టిస్ లోథా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లపాటు నిషేధం విదించిన విషయం విదితమే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Chennai Super Kings  IPL  N Srinivasan  SC  Supreme court  cricket news  

Other Articles