Virat Kohli and Ravi Shastri Caught In Another Controversy For Tie Up In IPTL tennis team | BCCI Anurag Thakur

Virat kohli ravi shastri tie up iptl tennis team controversy bcci anurag thakur

virat kohli, ravi shastri, iptl tennis team, anurag thakur, bcci, virat controversies, virat kohli love affair, ravi shastri financial affairs

Virat Kohli Ravi Shastri tie up IPTL tennis team Controversy BCCI Anurag Thakur : Virat Kohli and Ravi Shastri Caught In Another Controversy For Tie Up In IPTL Tennis Team. BCCI Secretary Angry On Them.

మరో వివాదంలో కోహ్లీ.. తప్పేంటని ప్రశ్నిస్తున్న రవి!

Posted: 09/14/2015 11:50 AM IST
Virat kohli ravi shastri tie up iptl tennis team controversy bcci anurag thakur

ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ గా సక్సెస్ అయిన విరాట్ కోహ్లీ.. వివాదాలకు కేరాఫ్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జట్టులో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మనోడు ఎన్ని వివాదాలకు తెరలేపాడంటే.. బహుశా అన్ని ఇన్నింగ్స్ కూడా ఆడి వుండడేమో అని సందేహం కలగక మానదు. ఇన్ని వివాదాల మూటగట్టుకున్న గర్వంగా తిరుగున్న విరాట్ అప్పుడే మరో తాజా వివాదంలో చిక్కుకున్నాడు. ఈసారి తనతోపాటు టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రిని సైతం ఆ వివాదంలో ఇరికించేశాడు. ఇంతకీ ఆ వివాదం ఏంటి? అందులో ఇరుక్కునేంత వారిద్దరు చేసిన ఘనకార్యమేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఐపీఎల్ మాదిరిగానే ఐటీపీఎల్ (ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్) సీజన్ మొదలైన విషయం తెలిసిందే! మహేష్ భూపతి డైరెక్టర్ గా వున్న లీగ్ 2014 నవంబర్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ లీగ్ లో కోహ్లీ, రవిశాస్త్రి ఇద్దరూ భాగస్వాములు అయ్యారు. ఐటీపీఎల్ జట్టు యూఏఈ రాయల్స్ లో కోహ్లీ కొంత వాటాను కొనుగోలు చేసి, రవిశాస్త్రిని సలహాదారుగా నియమించుకున్నాడు. ఈ విధంగా వారిరువురు చేయడంతో బీసీసీఐ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఎందుకంటే.. క్రికెట్ టీం, మేనేజ్ మెంట్, ఇతర సభ్యుల్లో ఎవరైనా మరో ఆటతో ప్రయోజనాలు పొందడం నిబంధనలకు విరుద్ధమని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది.. ఇప్పటికీ చెబుతూనే వుంది. కానీ.. ఆ నిబంధనను ఏమాత్రం పట్టించకోకుండా కోహ్లీ, రవిశాస్త్రిలు ఐటీపీఎల్ లో భాగస్వామ్యం కావడంతో సరికొత్త వివాదం తెరమీదికొచ్చింది.

ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కాస్తంత కోపంగానే వున్నారు. కోహ్లీ, రవిలు క్రికెట్ జట్టుకు సేవలందిస్తూ.. మరో ఆటతో ప్రయోజనాలు పొందడం నిబంధనలకు విరుద్ధమని ఆయన భావిస్తున్నారు. వారిరువురు ఐటీపీఎల్ తో బంధం ఏర్పరుచుకున్న తరువాత క్రికెట్ కు సంబంధించి పూర్తి న్యాయం చేయలేకపోవచ్చని, నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉండదని బీసీసీఐ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోపాద్రిక్తుడైన అనురాగ్.. ఈ విషయానికి సంబంధించి వారిద్దరితో చర్చిస్తానని వెల్లడించారు. ఈ వివాదం ఇలా రగులుతుంటే.. మరోవైపు రవిశాస్త్రి మాత్రం టెన్నిస్ కు, క్రికెట్ కు లింకేంటని.. భాగస్వామ్యం కావడంలో తప్పేంటని ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చివరకు ఈ వివాదం ఎంతవరకు రగులుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  ravi shastri  iptl tennis team  

Other Articles