SC stays criminal proceedings against cricketer MS Dhoni | Dhoni Cover Magazine Controversy

Supreme court stays criminal proceedings against ms dhoni

mahendra singh dhoni, supreme court of india, dhoni vishnu avatar, dhoni lord vishnu avatar, dhoni cover magazine controversy, ms dhoni latest updates, ms dhoni supreme court, business today magazine

Supreme Court stays criminal proceedings against MS Dhoni : The Supreme Court on Monday stayed criminal proceedings against cricketer Mahendra Singh Dhoni who has been accused of deliberately outraging religious sentiments with a visual depiction of him as Lord Vishnu in Business Today.

ధోనీకి ‘లడ్డూ’ తినిపించిన సుప్రీంకోర్టు

Posted: 09/14/2015 02:00 PM IST
Supreme court stays criminal proceedings against ms dhoni

ఇండియా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంత ‘కూల్’గా వుంటారో విశ్లేషించుకోవాల్సిన పనిలేదు. చాలావరకు వివాదాలకు దూరంగానే వుంటారు. ఏదైనా సమస్య వుంటే.. దాన్ని తన చతురతతో పరిష్కరిస్తాడు. అలాంటి ఈయనకు.. అనుకోకుండా ఓ వివాదం చుట్టేసుకుంది. ఆ వివాదం ఏంటి? అని అనుకుంటున్నారా! అదేనండి.. గతంలో ఓ బిజినెస్ మేగజైన్ ధోని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించగా.. సందరు సంస్థ తన మేగజైన్ ను వినూత్నంగా ప్రచారం చేస్తూ ధోనీని విష్ణుమూర్తి అవతారంలో ప్రచురించింది. అంతేకాదు.. అతని చేతుల్లో రకరకాల వస్తువులతోపాటు ‘షూ’ కూడా పెట్టింది. అంతే! అక్కడి నుంచి వివాదం తెరమీదకొచ్చింది.

ఆ ఫోటోను చూసిన హిందూ సంఘాలు.. మత విశ్వాసాలకు భంగం కలిగించేలా వ్యవహరించాడంటూ ధోనీపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే కర్ణాటక హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కాగా, ధోనీపై క్రిమినల్ కేసు నమోదైంది. దీనిపై ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ కేసును విచారించిన ధర్మాసనం స్టే ఆర్డర్ ఇచ్చి ధోనీకి ఊరటనిచ్చింది. తొలుత కర్ణాటక హైకోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలావుండగా.. ధోనీని విష్ణుమూర్తిగా చూపిస్తూ, షూ సహా పలు వస్తువులను ఆయన చేతుల్లో పెట్టిన మేగజైన్ కవర్ పేజీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఏదేమైనా.. గతకొన్నాళ్ల నుంచి ఈ కేసు ఊబిలో చిక్కుకున్న ధోనీని సుప్రీం రిలీఫ్ చేయడంతో ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  business today controversy  Supreme Court of india  

Other Articles