Ishant Sharma confirms his availability for Delhi’s second Ranji Trophy match

Unreachable ishant sharma omitted from delhi ranji team

ishant sharma, ishant sharma india, india ishant sharma, ishant india, india ishant, ishant sharma india cricket, india cricket ishant, cricket news, cricket, ranji trophy, delhi, gautam gambhir, rajasthan

Ishant Sharma has confirmed his availability from the second Ranji Trophy match but we are including him in the team right now,” DDCA Sports Secretary Sunil Dev

‘‘అందుబాటులో లేరు’’తో చేతులు కాల్చుకున్నాడు..

Posted: 09/24/2015 08:09 PM IST
Unreachable ishant sharma omitted from delhi ranji team

టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మకు దేశవాళి క్రికెట్ లో కూడా చేదు అనుభవం ఎదురైంది. అయన అందుబాటులో లేకుండా చేతులు కాల్చుకున్నారు. తీరా తన చేతులు కాలాయని తెలుసుకున్నాక.. చేసేది లేక పరుగులు తీయడంతో ఎట్టకేలకు ఆయన స్థానానికి ఢోకా లేకుండా పోయింది. అదెలా అంటారా..? దేశవాళీ క్రికెట్ కు ఢిల్లీ జట్టు తరుపున ఎంపిక విషయంపై మాట్లాడటానికి సెలెక్టర్లు ఫోన్‌ చేస్తే ఇషాంత్ ఫోన్ ఎత్తలేదు. మెసేజ్‌లు పంపినా బదులివ్వ లేదు. దీంతో సెలెక్టర్లు అతనికి ఢిల్లీ రంజీ జట్టులో చోటు కల్పించలేదు. ఈ విషయాన్ని ఢిల్లీ సెలెక్టర్‌ వినయ్‌ లాంబా తెలిపాడు.

‘ఇషాంత్‌ను సంప్రదించేందుకు మేం ప్రయత్నించాం. అయితే ఫోన్ కాల్స్‌కి గానీ, మేం పంపిన మెసేజ్‌లకు గానీ అతను బదులివ్వలేదు. ఇషాంత్‌పై ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధం ఉన్న సంగతి తెలుసు. అయితే, ఈ సమయంలో అతను ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడొచ్చా లేదా? అనేది మాకు తెలియదు. ఒకవేళ ఆతనికి అనుమతి ఉంటే, ఇప్పటికైనా అతణ్ని ఆడించేందుకు సిద్ధం' అని వినయ్ అన్నారు. దీంతో చేతులు కాల్చుకున్నానని తెలుసుకున్న ఇషాంత్ శర్మ.. పరుగుపరుగున వెళ్లి ఢిల్లీ బోర్డు సభ్యులను కలిశాడు. దీంతో ఎట్టకేలకు ఆయన స్థానం లభించింది. అయితే రెండో టెస్టు మ్యాచ్ నుంచి అందుబాటులో వుంటానని చెప్పినా.. ఆయనను తక్షణం జట్టులో చేరుస్తున్నామని ఢిడిసిఏ స్పోర్ట్స్ సెక్రటరీ సునీల్ దేవ్ ప్రకటన విడుదల చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ishant sharma  cricket  ranji trophy  delhi  gautam gambhir  rajasthan  

Other Articles