దాయాధి దేశం అన్ని విధాలుగానూ తన కపట బుద్దిని ప్రదర్శించేందుకు సిద్దమైంది. ఇన్నాళ్లు భారత్ తో సిరీస్ అడాలని పట్టబడ్డి.. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడితో మంతనాలు జరిపి భారత్ పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు యత్నించిన పాకిస్థాన్.. బిసిసిఐ ఎంతకీ దిగిరాకపోవడంతో.. చేసేది లేక తన నిజస్వరూపాన్ని బట్టభయలు చేసింది. వచ్చే డిసెంబర్ లో యూఏఈలో పాకిస్థాన్ తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ రద్దయితే ఇక భవిష్యత్తులో టీమిండియాతో ఎటువంటి మ్యాచ్ లు ఆడబోమని, ఒక రకంగా భారత మ్యాచ్ లను అన్నింటినీ తాము నిషేధిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
పాకిస్థాన్ తో సిరీస్ కు భారత క్రీడామంత్రిత్వ శాఖను నుంచి బీసీసీఐ ఎటువంటి అనుమతి కోరని పక్షంలో ఇక వారితో మ్యాచ్ లకు దూరంగా ఉంటామని షహర్యార్ ఖాన్ తెలిపారు. ఒకవేళ బీసీసీఐ ఆ సిరీస్ కు రావడానికి ఇష్టపడకపోతే.. వారితో ఇక మ్యాచ్ లు ఆడమని కుండబద్దలు కోట్టినట్లు తేల్చిచెప్పింది. పీసీబీ నిరసన తెలపడానికి ఆ మార్గమే సరైందని ఖాన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఐసీసీతో పాటు ఆసియా క్రికెట్ సమాఖ్య నిర్వహించే అన్ని మ్యాచ్ లను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి ఆగస్టు 28 వ తేదీన బీసీసీఐకు ఒక లేఖ అందజేశామని... దానిపై స్పష్టత ఇవ్వాల్సి అవసరం బీసీసీఐకు ఉందని కూడా ఆయన అన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more