Shashank Manohar new BCCI president, Srinivasan isolated

Shashank manohar the new bcci president

cricket, cricket news, bcci president, sharad pawar, n srinivasan, shashank manohar, bcci president, arun jaitley, arun jaitley jagmohan dalmiya, jagmohan dalmiya arun jaitley, arun jaitley finance minister, sharad pawar, BCCI,N Srinivasan, Anurag Thakur, BCCI, N Srinivasan, Jagmohan Dalmiya, Arun Jaitley, Amitabh Chaudhary

BCCI, former board chief Shashank Manohar has emerged as a new chief for cricket control board of india.

బిసిసిఐ రథసారధి శశాంక్ మనోహర్..మిగిలింది లాంఛనమే..!

Posted: 09/29/2015 05:31 PM IST
Shashank manohar the new bcci president

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పగ్గాలు అందుకోనున్నారు. ఆయన నియామకం దాదాపు ఖాయమైంది. ఈస్ట్ జోన్ నుంచి మనోహర్ కు పూర్తి మద్దతు ఉండటంతో ఆయన బోర్డు అధ్యక్షునిగా ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈస్ట్‌జోన్ నుంచి తమ అభ్యర్థిగా మనోహర్ పేరును బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ ప్రతిపాదించనున్నారు. క్యాబ్‌తో పాటు ఎన్‌సీసీ, త్రిపుర, జార్ఖండ్ క్రికెట్ సంఘాలు మనోహర్‌కు పూర్తి మద్దతునిస్తున్నాయి. దీంతో ఆయన నియామకం దాదాపుగా పూర్తైనట్లేనంటున్నాయి బిసిసిఐ వర్గాలు.
 
ఈమేరకు అక్టోబర్ 4వ తేదీన బీసీసీఐ అధ్యక్షున్ని ఎన్నుకోనున్నారు. అయితే అక్టోబర్ 3 వ తేదీన అధ్యక్ష పదవికి పోటీ పడే నామినేషన్ల స్క్రూట్నీ నిర్వహించిన తరువాత నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాగూర్ తెలిపారు.  దీంతో పాటు బీసీసీఐ ఏజీఎంలో పాల్గొనడానికి ముందే క్యాబ్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. భారత క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి ఎన్నిక కోసం 15 రోజుల్లోగా ఎస్‌జీఎం ఏర్పాటును వెల్లడించాలి.  ఈనెల 20న దాల్మియా మరణించాడు కాబట్టి వచ్చేనెల 5లోపు బీసీసీఐ అధ్యక్షున్ని ఎన్నుకోవాలి. ఒకవేళ బీసీసీఐ అధ్యక్షుడిగామనోహర్ ఎన్నికైతే మాత్రంఆ పదవిని ఆయన రెండో సారి దక్కించుకున్నట్లవుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  cricket news  bcci president  sharad pawar  n srinivasan  shashank manohar  bcci president  

Other Articles