India 'A' beat South Africa by 8 wickets in high-scoring T20 warm-up

India a trounce south africans by 8 wickets in t20 warm up match

india vs south africa, south africa vs india, ind vs sa, sa vs ind, india vs south africa 2015, mayank agarwal, mayank, manan vohra, india a, india a vs south africa, cricket news, cricket score, cricket

India 'A' chased down South Africa 'A' 189 with 8 wickets remaining; Mayank Agarwal, Manan Vohra scored quickfire fifties.

దక్షిణాఫ్రికాపై టీమిండియా ఎ విజయం

Posted: 09/29/2015 06:12 PM IST
India a trounce south africans by 8 wickets in t20 warm up match

కాసింత పెద్ద ఫార్మెంట్ తో ఇండియాలోకి అడుగుపెట్టి.. టెస్టు, వన్డే, టీ-20 సిరీస్ లలో తమ ప్రతిభను చాటుకుని వెళ్తామనుకున్న సఫారీలకు ఇవాళ జరిగిన  ట్వంటీ 20 వార్మప్ మ్యాచ్ లో భారత్ 'ఎ' చుక్కలు చూపించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత ఏ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విసిరిన 190 పరుగుల లక్ష్యాన్ని భారత కుర్రాళ్లు ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు.. భారత ఆటగాళ్లలో మనన్ వాహ్రా(56), మయాంక్ అగర్వాల్(87) శుభారంభం అందించారు. అనంతరం సంజా శామ్ సన్(31), కెప్టెన్ మన్ దీప్ సింగ్(12) నాటౌట్ గా మిగిలి.. భారత'ఎ' కు విజయాన్ని అందించారు.
 
అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 189 పరుగుల లక్ష్యాన్ని చేసింది. దీంతో 190 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ జట్టు సునాయాసంగా విజయాన్ని నమోదు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టులో.. ఓపెనర్ డీ కాక్ (2) పరుగులకే పెవిలియన్ కు చేరి దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. అనంతరం ఏబీ డివిలియర్స్ -కెప్టెన్ డు ప్లెసిస్ జోడీ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఇన్నింగ్స్ ముందుకెళుతున్న సమయంలో డు ప్లెసిస్(42) రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరగా,  డివిలియర్స్ (37) రెండో వికెట్ గా వెనుదిరిగాడు.  చివర్లో జేపీ డుమినీ(68) హాఫ్ సెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  south africa  cricket  ind vs sa  india A team  

Other Articles