India will be favourites at World T20 next year: Lara

India will be favourites at world t20 next year says lara

telangana, brian lara, ms dhoni, kt rama tao, parineeti chopra, team india, cricket, Brian Lara, World T20, Indian cricket team, World Twenty20 Championship, india vs south africa

the Indian cricket team will be among the strongest contenders when the country hosts next year's World Twenty20 Championships, feels West Indies batting legend Brian Lara.

టీ20 వరల్డ్ కఫ్ 2016 హాట్ ఫేవరెట్ భారత్

Posted: 10/14/2015 06:49 PM IST
India will be favourites at world t20 next year says lara

ఫోట్టి ఫార్మెట్ క్రికెట్ లో భారత్ సంచలనంగా మారుతుందని వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ బ్రయాన్ లారా అన్నాడు. ప్రస్తుతం కాస్తా ఒడిదోడుకులను ఎదుర్కోంటున్న టీమిండియా.. రానున్న టీ-20 ప్రపంచ కప్ నాటికి పూర్తిస్థాయిలో పుంజుకుని హాట్ ఫేవరెట్ గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. స్వదేశంలో ఆడుతున్నప్పుడు ఆ ఓత్తిడి ఎలా వుంటుందో తాను అర్థం చేసుకోగలనని చెప్పాడు తీవ్ర ఒత్తిడి కారణంగానే భారత్ స్వదేశంలో సఫారీలతో జరిగిన టీ-20 మ్యాచ్ లలో రాణించలేకపోయిందని అభిప్రాయపడ్డాడు.

భారత క్రికెట్ జట్టుకు.. వన్డే, ట్వంటీ 20 సారథి మహేంద్ర సింగ్ ధోనీ అవసరం ఎక్కువగా ఉందని లారా పేర్కోన్నారు. హైదరాబాద్లోని హోటల్ తాజ్‌కృష్ణలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన లారా అనంతరం మీడియాతో మాట్టాడుతూ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో ఆయన పై వస్తున్న విమర్శల నేపథ్యంలో బ్రయాన్ లారా ధోనికి అండగా నిలిచారు. టీమిండియాకు ధోనీ అవసరం ఎక్కువగా ఉందని చెప్పారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తరువాత లారా కూడా ధోనికి అండగా నిలిచారు.

టీమిండియా ఓటమికి కేవలం ధోనీనే బలి పశువును చేయడం సరికాదన్నాడు. శిఖర్ ధావన్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, బిన్నీ వంటి ఆటగాళ్ల ప్రదర్శన పైన ఎవరూ లేవనెత్తడం లేదని, బౌలర్లు కూడా సరైన ప్రదర్శన ఇవ్వడం లేదన్నాడు. ధోనీకి మరో మూడు నుంచి ఐదేళ్లు ఆడే సత్తా ఉందన్నాడు. విదేశీ ఆటగాళ్లు కూడా ధోనీపై విమర్శలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ధోనీని విమర్శించడం సరికాదని, ధోనీ గొప్ప ఆటగాడని, నాయకుడు అని, అంతకంటే గొప్ప వ్యక్తి అని లారా కితాబిస్తున్నారు. ప్రత్యర్థులుగా మాకూ అతడి పైన ఎంతో గౌరవం ఉందంటున్నారు. అయితే అదే సమయంలో వెస్టీండీస్ క్రికెట్ జట్టుకు తాను మెంటర్ గా పనిచేసినా ప్రతిఫలాలు మారవని, తమ జట్టు పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేయాల్సిన  అవసరం వుందని లారా అన్నారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brian Lara  World T20  Indian cricket team  World Twenty20 Championship  

Other Articles