SCA|Saurashtra Cricket Association|Rajkot ODI|Patidars|India vs South Africa

Patidars buy 1 000 tickets of rajkot odi reports

Patidars buy 1,000 tickets of Rajkot ODI,SCA,Saurashtra Cricket Association,Rajkot ODI,Patidars,India vs South Africa

SCA|Saurashtra Cricket Association|Rajkot ODI|Patidars|India vs South Africa

సౌరాష్ట్ర మ్యాచ్ పై ఉత్కంఠ.. 1000 టిక్కెట్లను కొన్న పటేదార్లు

Posted: 10/14/2015 06:44 PM IST
Patidars buy 1 000 tickets of rajkot odi reports

తమను బిసీలలో చేర్చాలని, రిజర్వేషన్ పౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ అందోళన కార్యక్రమాలు చేసి.. యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన గుజరాత్ పటేదార్ల ఉద్యమం.. ఇప్పుడు క్రికెట్ అభిమానులకు మింగుడు పడనీయడం లేదు. గుజరాత్ లోని నాల్గవ అతిపెద్ద నగరంగా ప్రఖ్యాతి చెందిన రాజ్ కోట్ లో ఈ శుక్రవారం జరగనున్న వన్డే మ్యాచ్ లో పటేదార్లు ఎలాంటి అంధోళన కార్యక్రమాన్ని చేస్తారన్న అంశంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకోంది. మ్యాచ్ మద్యలో పటేదార్లు అంతరాయం కల్పించకుండా తమ అందోళనా కార్యక్రమాలను నిర్వహించుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

అయితే వినూత్న నిరసనల ద్వారా దేశంలో సంచలనంగా మారిన పటేళ్ల ఉద్యమం నేత హార్థిక్ పటేల్.. తమ వినూత్న నిరసన ద్వారా యావత్ ప్రపంచ దృష్టిని అకర్షించాలని భావిస్తున్నాడని సమాచారం. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని తమ పటేళ్లను వెనకబడిన తరుగతుల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అందివచ్చిన అవకాశంగా సౌరాష్ట్రలోని రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న క్రికెట్ వన్డే మ్యాచ్ ను వినియోగించుకోనున్నట్లు సమాచరం. ఇప్పటికే సుమారుగా 1000 మంది పటేదార్లు క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను కోనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్న కేవలం 2000 టిక్కెట్లను మాత్రమే సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ విక్రయించగా వాటిలో వెయ్యి టిక్కెట్లను పటేదార్లు కొన్నారని తెలుస్తుంది. దీంతో మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంట నెలకోంది.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SCA  Saurashtra Cricket Association  Rajkot ODI  Patidars  India vs South Afri  

Other Articles