indian spinner harbhajan and actress geeta basra sangeet party held in jalandhar like huge event | geeta basra life story | harbhajan singh marriage updates

Harbhajan geeta basra sangeet party held in jalandhar like huge event

harbhajan geeta basra, harbhajan geeta basra sangeet party, harbhajan geeta basra marriage, harbhajan sangeet party, geeta basra sangeet party, geeta basra hot photo shoot, harbhajan singh life story

harbhajan geeta basra sangeet party held in jalandhar like huge event : indian spinner harbhajan and actress geeta basra sangeet party held in jalandhar like huge event.

అంగరంగ వైభవంగా భజ్జీ సంగీత్ పార్టీ..

Posted: 10/28/2015 12:19 PM IST
Harbhajan geeta basra sangeet party held in jalandhar like huge event

టీమిండియా స్పిన్సర్ హర్భజన్ సింగ్ తన స్పిన్ తో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకోగా.. అదే స్పిన్ తో ఓ బాలీవుడ్ తారను పడగొట్టిన విషయం తెలిసిందే! అదేనండి.. తన సెక్సీ అవతారంతో బాలీవుడ్ తెరకు ఎంట్రీ ఇచ్చిన గీతా బస్రా.. భజ్జీ ప్రేమలో పడిన తర్వాత సినిమాలకు దూరమయ్యింది. గతకొన్నాళ్ల నుంచి ప్రేమాయణం నడుపుతున్న వీరిద్దరూ.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతీ విదితమే! కానీ.. పెళ్లి ఎప్పుడన్న విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా దాచిన ఈ జంట.. మంగళవారం తమ సంగీత్ పార్టీని అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఇప్పుడు దానిగురించే దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి.

సాధారణంగా పెళ్ళికిముందు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే.. భజ్జీ, గీతా బస్రాల పెళ్లికి ముందు సంగీత్ కార్యక్రమాన్ని వారిరువురి కుటుంబసభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజ్జీ కలర్ ఫుల్ డ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. పంజాబ్ లోని జలంధర్ లో వేడుకగా జరిగిన ఈ సంగీత్ లో.. తెలుపు రంగు చొక్కా, ప్యాంటు, వాటిపై ఆరెంజ్ కలర్ ఆప్ కోటు, అదే కలర్ లో తలపాగాతో ముస్తాబైన భజ్జీ కొత్త లుక్ లో అదిరిపోయాడు. ఇక అతడి పక్కన గ్రీన్ కలర్ చుడీదార్ లో కూర్చుకున్న గీతా బస్రా తన అందంతో, అమాయకత్వంతో, సంస్కృతీ సంప్రదాయాలతో అతిథులను ఇట్టే ఆకర్షించింది. ఈ జంట ఫోటోలకు పోజులిస్తూ ఎంతో మురిసిపోయారు. ఇదిలావుండగా.. వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలో గురువారం జరగబోతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbhajan geeta basra  india cricket team  

Other Articles