bollywood actress anushka sharma denies the rumours of marriage with virat kohli | bollywood updates | indian cricket team

Anushka denies marriage with virat kohli bollywood movies

anushka sharma, virat kohli, bollywood updates, indian cricket team, anushka virat marriage, anushka love affairs, virat kohli love affairs

anushka denies marriage with virat kohli bollywood movies : bollywood actress anushka sharma denies the rumours of marriage with virat kohli.

ఆ వదంతుల్ని కొట్టిసారేసింది.. ఆందోళనలో విరాట్!

Posted: 10/28/2015 03:43 PM IST
Anushka denies marriage with virat kohli bollywood movies

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మలు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విషయం తెలిసిందే! గతకొన్నాళ్ల నుంచి బహిరంగంగానే చట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఈ జంట.. త్వరలోనే పెళ్లి చేసుకోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల అనుష్క తన ప్రియుడు విరాట్తోపాటు తన తండ్రితో కలసి కనిపించింది. దీంతో అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతోందని... ఇరు కుటుంబాలు త్వరలో సమావేశమై వివాహ తేదీని నిర్ణయించనున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు.. పెళ్లి తర్వాత తమకోసం ఓ ఇంటిని కూడా గాలిస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అనుష్క ఈ వదంతుల్ని కొట్టిపారేసింది. తామిద్దరం ఇప్పుడే వివాహం చేసుకోవడం లేదంటూ అనుష్క స్పష్టం చేసింది.

బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న అనుష్క.. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ఫుల్ బిజీ అయింది. వరుష షెడ్యూల్స్ చేసుకుంటూ తీరికలేకుండా సమయాన్ని గడుపుతోంది. కనీసం ఇంట్లోవాళ్లతోనూ కాసేపు తీరికగా గడిపేందుకు సమయం లేక షూటింగులకే పరిమితం అయినట్లు ఆమె వెల్లడిస్తోంది. దీంతో తానిప్పుడే పెళ్లి చేసుకోవడం లేదని ఆమె స్పష్టం చేసింది. అనుష్క ప్రతినిధి అయిన ఓ వ్యక్తి కూడా.. ఈ వదంతులపై స్పందిస్తూ వాటిలో వాస్తవం లేదంటూ కొట్టిపారేశాడు. 'అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఆమె తీరికలేకుండా ఉంది. కెరీర్, జీవితం గురించి స్పష్టతతో ఉంది. అనుష్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి వచ్చే వదంతులను నమ్మకండి. ఆ సమయం వచ్చినపుడు ఆమే స్వయంగా ప్రకటిస్తుంది' అని అతగాడు వెల్లడించాడు. ప్రస్తుతం అనుష్క ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు మరో రెండు ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు కొన్ని ప్రైవేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది.

ఇదిలావుండగా.. అనుష్క ఇచ్చిన స్టేట్ మెంట్ విన్న విరాట్ కోహ్లీ ఆందోళనలో పడ్డాడని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. ఇటీవల విరాట్ కెరీర్ అంత సౌఖ్యంగా సాగడం లేదు. పేలవ ప్రదర్శనలు ఇవ్వడంతోపాటు టీమిండియా వరుసగా పరాజయాలు అవుతోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకుంటే తన కెరీర్ చక్కబడుతుందని భావించిన కోహ్లీ.. త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. పెళ్లి తర్వాత సమస్యలు తొలగిపోతాయనే నమ్మకంతో ఆ దిశగా ఆలోచనలు మొదలుపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. కానీ.. ఇంతలోనే అనుష్క ఇప్పట్లో పెళ్లి వుండదని స్పష్టం చేయడంతో విరాట్ మరింత టెన్షన్ లో మునిగిపోయాడని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka sharma  virat kohli  bollywood updates  

Other Articles