harbhajan singh apologizes to media personnel who were beated by bouncers at his wedding | geeta basra marriage

Harbhajan singh apologizes to media personnel bashed up at his wedding event

harbhajan singh sorry, harbhajan singh sorry to media, harbhajan singh marriage news, harbhajan singh marriage controversy, harbhajan singh updates, harbhajan singh geeta basra updates, harbhajan singh bouncers attack on media, bouncers attack on media

harbhajan singh apologizes to media personnel bashed up at his wedding event : harbhajan singh apologizes to media personnel who were beated by bouncers at his wedding for recording video on their cam.

పెళ్ళిలో తప్పయిపోయిదంటూ సారీ చెప్పిన భజ్జీ..?

Posted: 10/30/2015 04:45 PM IST
Harbhajan singh apologizes to media personnel bashed up at his wedding event

టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ప్రియురాలు గీతా బస్రాను గురువారం జలంధర్ లో వివాహం చేసుకున్నాడు. ఎంతోమంది సమక్షంలో అంగరంగ వైభవంగా సాగిన ఈ పెళ్లి వేడుకలో ఓ చిన్నవివాదం చెలరేగింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న భజ్జీ.. జరిగిన తప్పిదానికి క్షమించాల్సిందిగా వేడుకున్నాడు. ఇంతకీ భజ్జీ ఎందుకు సారీ చెప్పాడు..? ఎవరికీ చెప్పాల్సి వచ్చింది..? అసలు అక్కడ జరిగిన వివాదం ఏంటి..? అని అనుకుంటున్నారా! ఆవివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే.

దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు హాజరైన హర్భజన్-గీతా బస్రాల పెళ్లిని వీడియో తీసేందుకు కొందరు మీడియా ప్రతినిధులు వివాహ వేదిక పొరుగింటిపై నుంచి ప్రయత్నించారు. వీరిని గమనించిన బౌన్సర్లు అతిగా స్పందించి వారిపై దాడి చేశారు. వారి చేతుల్లో వున్న కెమెరాలను లాక్కుని పగులగొట్టేశారని తెలిసింది. అంతేకాదు.. వారిపై చెయ్యి కూడా చేసుకున్నారట. భజ్జీ పెళ్లి వైభవంగా జరిగినా.. చివర్లో మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేయడంతో వివాదం ఏర్పడింది. ఈ వివాదం జరిగినప్పుడు భజ్జీ పెళ్లి వేడుకలో వున్న కారణంగా ఆ విషయం అప్పుడు అతనికి తెలియరాలేదు. చివరగా ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న హర్భజన్.. మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాడు. దీంతో ఈ వివాదం చల్లారింది.

ఇదిలావుండగా.. భజ్జీ పెళ్ళిలో క్రికెట్ దిగ్గజ సచిన్ టెండూల్కర్ సతీసమేతంగా హాజరైన విషయం తెలిసిందే! వారువురు ఈ పెళ్లికి విచ్చేసి.. దంపతులిద్దరినీ ఆశీర్వదించారు. అలాగే.. పలువు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులతోపాటు తోటి క్రీడాకారులు భజ్జీకి సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbhajan singh marriage  bouncers attack on media  geeta basra  

Other Articles