bcci wants to make new trophy with the rods of mahatma gandhi and nelson mandela jail cells | bcci trophies | india vs south africa

Bcci plans to make new trophy with the rods of mahatma gandhi and nelson mandela jail cells

bcci new trophy, mahatma gandhi yerawada jail, nelson mandela jail rods, india vs south africa, bcci new plan for trophies, bcci updates

bcci plans to make new trophy with the rods of mahatma gandhi and nelson mandela jail cells : BCCI wants to make trophy out of jail rods of Mahatma Gandhi's cell in Yerwada jail and With Nelson Mandela's Cells iconic freedom fighters who spent major portion of their lives behind bars.

గాంధీ, మండేలా జైలు ఊచలు కావాలంటున్న బీసీసీఐ

Posted: 10/30/2015 04:48 PM IST
Bcci plans to make new trophy with the rods of mahatma gandhi and nelson mandela jail cells

అదేంటి..? మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా గడిపిన జైలు గదుల ఊచలతో బీసీసీకి ఏం పని..? స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారికి, క్రికెట్ రంగానికి మధ్య సంబంధం ఏముందని వారు ఊచలు అడుగుతున్నారు..? ఇంతకీ బీసీసీఐ ప్రణాళిక ఏంటి..? అనే సందేహాలు ప్రతిఒక్కరికీ రాక మానదు. అయితే.. అలా అడగడం వెనుక ఓ బలమైన కారణం వుందని ఆ వర్గ చెబుతోంది. ఆ వివరాలు ఏంటో తెలియాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే!

నేటి ఆధునిక యుగంలో ప్రతిఒక్కరు రొటీన్ కు భిన్నంగా కోరుకుంటున్నారు. పాత పద్ధతులను కాకుండా కొత్తదనం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అందుకు తగినట్లుగానే అన్నిరంగాలు తమ ప్రణాళికల్లో మార్పులు చేసి, ప్రేక్షకులను ఆనందింపచేసేలా కొత్త విధానాలను అమలులోకి తీసుకొస్తున్నాయి. తద్వారా ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతోపాటు సదరు కంపెనీల క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ విషయాన్ని పసిగట్టిన బీసీసీఐ ఆ తరహాలోనే పావులు కదుపుతోంది. తమ క్రీడాకారుల్ని సంతోష పెట్టేందుకు ఈసారి ఓ కొత్త విధానాన్ని అవలంభిస్తోంది. త్వరలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రారంభం కానున్న ‘ఫ్రీడం సిరీస్’ టెస్ట్ మ్యాచ్ ల అనంతరం విజేతలకు ఇచ్చే ట్రోఫీ చాలా వినూత్నంగా వుండాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ సిరీస్ మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలాలాను గుర్తు చేసుకుంటూ సాగుతున్న నేపథ్యంలో.. ట్రోఫీ తయారీ కోసం గతంలో వారు గడిపిన జైలు గదుల ఊచలు కావాలని అడుగుతోంది.

స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న వేళ గాంధీని బందీగా వుంచిన పుణెలోని ఎరవాడ జైలు గది నుంచి, అలాగే మండేలా ఏళ్లపాటు కాలం గడిపిన రాబిన్ ఐలాండ్ జైలు గది నుంచి ఊచలను పీకి ఇవ్వాలని బీసీసీఐ ఇప్పటికే లేఖలు రాసింది. ఈమేరకు శశాంక్ మనోహర్ పుణెలోని జైళ్ళ డీజీకి స్వయంగా లేఖ రాశారు. అయితే.. ఈ లేఖపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ.. టెస్ట్ మ్యాచ్ ట్రోఫీ మాత్రం వారిరువురు నివసించిన జైలు గదుల ఊచలోనే తయారవుతుందని సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci new trophy  mahatma gandhi  nelson mandela  

Other Articles