Labourer's son Nathu Singh dreams of breaking Shoaib Akhtar's speed record

Nathu singh from labourer s son to india s fast bowling future

Nathu Singh, fast bowler, Rajasthan, Sandeep Patil, Board President’s squad, two-day warm-up match, South Africa, india's fast bowling future, Shoaib Akhtar's speed record, Nathu Singh dreams of breaking Shoaib Akhtar's speed record, cricket, latest cricket news

Nathu Singh, a fast bowler from Rajasthan, was picked by chief selector Sandeep Patil in the Board President’s squad for the two-day warm-up match against South Africa

అక్తర్ రికార్డును అధిగమించాలన్నదే అతని కల..

Posted: 11/02/2015 07:14 PM IST
Nathu singh from labourer s son to india s fast bowling future

పేస్ బౌలింగ్‌తో పాకిస్తాన్ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ రికార్డును తాను అధిగమించాలన్నదే స్వప్నంగా పెట్టుకుని రాణిస్తున్న యువ పేసర్ నాథూ సింగ్. ఇప్పటికే పలువురు మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లను ఆకర్షించాడు. అతని బౌలింగ్‌ను బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ప్రశంసించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మ్ అప్ మ్యాచులో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దేశీయ క్రికెట్ లో ఇప్పటికే తన స్వప్నం చేరుకునే దిశగా అలజడి చేస్తూ.. ముందుకు సాగుతున్నాడు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని వైర్ ఫ్యాక్టరీలో పని చేసే ఓ సాధారణ కార్మికుడి కుమారుడే ఈ నాథూ సింగ్.

గల్లీ క్రికెట్ ఆడుతూ.. భారత క్రికెట్‌కు ఆడాలని సింగ్ ఆకాంక్షించిన నాథూ సింగ్ ను, అతని తండ్రి భరత్ సింగ్ తన కష్టార్జీతమంతా నాథూ కోసమే ఖర్చు పెట్టి రంజీ ఆటగాడిగా నిలబెట్టాడు. చెన్నైలోని ఎమ్మార్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌‌లో ఉన్న సమయంలో పేస్ దిగ్గజం గ్లేన్ మెక్‌గ్రాత్ కూడా నాథూ బౌలింగ్ చూసి మెచ్చుకున్నాడు. దీంతో నాథూ జైపూర్‌లోని సురణ అకాడమీలో చేరాడు. మూడు సంవత్సరాల వ్యవధిలోనే హషీం ఆమ్లా, ఏబి డివిలియర్స్‌కు బౌలింగ్ వేసే స్థాయికి చేరుకున్నాడు.

ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరిగిన మ్యాచులో రాజస్థాన్ తరపున తొలిసారి ఆడిన నాథూ సింగ్ 87 పరుగులకు 7 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. కాగా, తనకు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ అంటే ఇష్టమని, అతని స్పీడ్(గంటకు160కి.మీ.)బ్రేక్ చేయడమే తన లక్ష్యమని నాథూ సింగ్ చెప్పాడు. ‘ఇది నాకు ఎంతో సంతోషం కలిగించే అంశం.అంటూనే కొన్నిసార్లు తన లక్ష్యాలు తనను భయపెడుతున్నాయన్నాడు. భవిష్యత్‌ను ఆలోచించకుండా ప్రస్తుతంపై దృష్టి సారిస్తానని తెలిపాడు. తదుపరి మ్యాచులో మరింతగా రాణించేందుకు కృషి చేస్తానని చెప్పాడు. కాగా, ఫాస్ట్ క్లాస్ క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నా నాథూ సింగ్.. త్వరలోనే జాతీయ జట్టులో చేరి రాణించాలని ఆశిద్దాం.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nathu Singh  fast bowler  Rajasthan  Sandeep Patil  

Other Articles