Sachin Tendulkar | Shane Warne | New York | All Stars Series

Tendulkar warne land in new york for all stars series

Shane Warne, Sachin Tendulkar, All Stars series, baseball's World Series, Citi Field, New York, New York Mets, Kansas City Royals, Warne's Warriors, Sachin's Blasters, Houston, Los Angeles, Matthew Hayden, Ricky Ponting, VVS Laxman, Wasim Akram, Brian Lara, usa, america

Two of cricket's biggest names, Shane Warne and Sachin Tendulkar, have landed here ahead of the first of three historic Cricket All Stars matches in the United States later this month

న్యూయార్క్ సిటీఫీల్డ్ కు చేరకున్న సచిన్, వార్న్

Posted: 11/02/2015 06:47 PM IST
Tendulkar warne land in new york for all stars series

క్రికెట్ దిగ్గజాలు మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండుల్కర్, అస్ట్రేలియన్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ సంయుక్తంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి అనుమతి మేరకు నిర్వహిస్తున్న క్రికెట్ ఆల్ స్టార్ సిరీస్-2015 కోసం షేన్ వార్న్, సచిన్ టెండుల్కర్లు అమెరికాలోని న్యూయార్క్ సిటీ ఫీల్డ్ కు చేరుకున్నారు. అమెరికాలో జరుగనున్న క్రికెట్ ఆల్ స్టార్ సిరీస్ ట్వంటీ 20 టోర్నీలో పాల్గొనేందుకు వారు సంసిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే సిటీ ఫీల్డ్ లో జరుగుతున్న బేస్ బాల్ సిరీస్ కు వారిద్దరూ హాజరయ్యారు.

ఈ వారాంతం నవంబర్ 7న సచిన్ బ్లాస్టర్స్- వార్న్ వారియర్స్ జట్ల మధ్య పోరు ప్రారంభం కానుంది. న్యూయార్క్ వేదికగా జరిగే తొలి ట్వంటీ 20 పోరుకు అన్ని సన్నాహాలను దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు న్యూయార్క్ చేరుకున్నారు. అనంతరం నవంబర్ 11 వ తేదీన హూస్టన్ లో, 14 వ తేదీన లాస్ ఏంజిల్స్ లో మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్ లు డే మ్యాచ్ లు కాగా, లాస్ ఏంజిల్స్ లో జరిగే మూడో మ్యాచ్ డే అండ్ నైట్.

అమెరికాలో క్రికెట్ ను విస్తరించేందుకు గాను క్రికెట్ ఆల్ స్టార్ సిరీస్-2015 పేరిట టోర్నీ నిర్వహించేందుకు సచిన్, వార్న్ లు నడుంబిగించిన సంగతి తెలిసిందే. సచిన్ బాస్లర్స్ టీమ్...వార్న్ వారియర్స్ జట్టుతో తలపడుతుంది. ఈ రెండు జట్లకు సచిన్, వార్న్‌లు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ మ్యాచ్ ల్లో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్, రికీ పాంటింగ్, మాథ్యూ హెడెన్,మెక్‌గ్రాత్, హాడిన్‌ లాంటి 24 మంది మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shane Warne  Sachin Tendulkar  All Stars matches  New York  

Other Articles