టీమిండియా కెప్టెన్ ఎం ఎస్ ధోనీ కొత్త అవతారం ఎత్తనున్నారు. మిస్టర్ కూల్ గా టీం ను ఎలా డీల్ చెయ్యాలో ధోనీకి తెలిసినంతగా.. ఏ కెప్టెన్ కు తెలియదు అని చాలా మంది నమ్ముతారు. అయితే తాజాగా ఐపిఎల్ లో సొంతంగా టీంను కొనుక్కోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని త్వరలో బాస్ గా మారబోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఏడేళ్ల పాటు కెప్టెన్-గా ఆడిన మహీ ఇప్పుడు ఆ జట్టుపై నిషేధం ఉండటంతో ఐపీఎల్-లో ఒక జట్టును కొనేందుకు రెడీ అయ్యాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో రెండు కొత్త జట్లకు బిడ్స్ వేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గతంలోనే నిర్ణయించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రెండేళ్ల నిషేధం ఉండటంతో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో కొత్త జట్టును కొని యజమాని అవతారం ఎత్తబోతున్నాడు. చెన్నై, రాజస్థాన్ జట్ల స్థానంలో ఇండోర్, కాన్పూర్, అహ్మదాబాద్ నుంచి రెండు జట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఒక జట్టును కొనేందుకు ధోనీ రెడీ అయ్యాడు. అయితే ఐపీఎల్ జట్ల కొనుగోళ్ల అంశాన్ని బీసీసీఐ దృష్టికి కూడా మహీ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ధోని యజమానిగా మారితే అదే జట్టులో ఆటగాడిగా కొనసాగుతాడా? నిబంధనల ప్రకారం అలా వీలవుతుందా? అనే సందేహాలు అభిమానుల్లో ప్రారంభమయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more