Ramesh Powar has announced his retirement after 2015-16 Ranji Trophy | international cricket tournment

Ramesh powar to retire after 2015 16 ranji trophy

ramesh powar, virender sehwag, zaheer khan, international cricket council, ramesh powar career

Ramesh Powar to retire after 2015-16 Ranji Trophy : Ramesh Powar has announced his retirement after 2015-16 Ranji Trophy.

క్రికెట్ కి వీడ్కోలు పలికిన మరో క్రికెటర్

Posted: 11/10/2015 07:28 PM IST
Ramesh powar to retire after 2015 16 ranji trophy

చాలాకాలం నుంచి టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వీడ్కోలు పలుకుతున్నారు. ఇప్పటికే సెహ్వాగ్, జహీర్ ఖాన్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించగా.. తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేష్ పవార్ కూడా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ తో పాటు కాంపిటేటివ్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు. గత ఎనిమిది సంవత్సరాల క్రితం టీమిండియా జట్టులో చివరి సారి ఆడిన పవార్.. ఆ తరువాత దేశవాళీ మ్యాచ్ లు ఆడాడు. పవార్ తాజా నిర్ణయంతో  తన 15 ఏళ్ల దేశవాళీ మ్యాచ్ లకు ముగింపు పలికినట్లయ్యింది.   క్రికెట్ మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ లో పాల్గొనే ఉద్దేశం ఉన్నందునే తాను వీడ్కోలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

2004లో పాకిస్థాన్ తో రావల్పిండిలో జరిగిన మ్యాచ్ తో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన పవార్.. భారత క్రికెట్ జట్టు తరపున పవార్ రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. వన్డేలో 34 వికెట్లు తీయగా, టెస్టుల్లో ఆరు వికెట్లు తీశాడు. తన చివరి వన్డేలో 2007లో ఆస్ట్రేలియాతో కొచ్చిలో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నాడు. పవార్ ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 146 మ్యాచ్ లు ఆడి 470 వికెట్లు తీశాడు. రంజీల్లో ముంబై తరపున ఆడిన పవార్.. 2008, 2010, 2012 సంవత్సరాల్లో ఐపీఎల్ టోర్నీల్లో కింగ్స్ పంజాబ్ కు ప్రాతినిథ్యం వహించగా, 2011 లో కొచ్చి టస్కర్ తరపున ఆడాడు. 2015-2016 రంజీ ట్రోఫీ ఆడిన తర్వాత తాను క్రికెట్ కు రమేష్ వీడ్కోలు ప్రకటించనున్నట్లు తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramesh powar  indian cricketers  

Other Articles