క్రీడాకారులకు, కళాకారులకు ఎల్లలు లేవని అనేక మంది తమ అభిప్రాయాలను వెళ్లడిస్తున్న క్రమంలో.. ఎలాంటి బేషజాలకు పోకుండా మాటల తూటాలను పేల్చకుండా, తాను తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోనే వ్యక్తం చేస్తున్నాడు భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన క్రికెట్ స్టార్స్ తో కలసి ఏర్పాటు చేసిన అల్ స్టార్స్ క్రికెట్ లీగ్ ను పాకిస్థాన్ లో ఆడేందుకు సచిన్ సుముఖత వ్యక్తం చేశాడు.
ఓ వైపు సరిహద్దులో కాల్పుల విరమణకు పాల్పడుతున్న పాకిస్థాన్ ద్వందనీతిని ఎండగడుతూ.. టీమిండియా పాక్ తో జరాగాల్సిన సిరీస్ లను రద్దు చేసుకునే దిశగా పూనుకుంటున్న తరుణంలో సచిన్ టెండుల్కర్ సహాసోపేత నిర్ణయమే తీసుకున్నారు. ఆల్ స్టార్ టి20 మ్యాచ్ ను పాకిస్థాన్ లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు. తమ దేశంలోనూ అల్ స్టార్ క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించాలని సచిన్ ను పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కోరడంతో ఆయన ఈ మేరకు అంగీకారం తెలిపారు.
తన ప్రతిపాదనకు సచిన్ సంతోషంగా అంగీకరించాడని, ఇది కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడని అక్తర్ వెల్లడించాడు. మాజీ క్రికెటర్లతో సచిన్, షేన్ వార్న్ ఆల్ స్టార్ టి20 నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ న్యూయార్క్ లో నిర్వహించారు. రెండో మ్యాచ్ గురువారం హూస్టన్ లో జరుగుతోంది. అక్తర్ తో పాటు వసీం అక్రమ్, సక్లెయిన్ ముస్తక్, మెయిన్ ఖాన్ కూడా ఆల్ స్టార్ సిరీస్ లో ఆడుతున్నారు. భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, అజిత్ అగార్కర్ కూడా ఇందులో ఉన్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more