Indian cricketer Robin Uthappa to tie knot with his long time girlfriend sheetal girlfriend | india cricketers marriages

Robin uthappa to tie knot with girlfriend sheethal gautam soon

Robin Uthappa news, Robin Uthappa marriage, Robin Uthappa sheetal gautam, sheetal gautam news, Robin Uthappa updates, Robin Uthappa plans for proposal, Robin Uthappa sheetal gautam news, sheetal gautam career

Robin Uthappa to tie knot with girlfriend sheethal gautam soon : Indian cricketer Robin Uthappa to tie knot with his long time girlfriend sheetal girlfriend. he says he is making planning for proposal for months.

ప్రియురాల్ని పెళ్ళి చేసుకోబోతున్న మరో క్రికెటర్

Posted: 11/16/2015 04:36 PM IST
Robin uthappa to tie knot with girlfriend sheethal gautam soon

చాలాకాలం నుంచి టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న క్రికెటర్లకు ఆ అవకాశం లభించని పక్షంలో పెళ్ళికి సిద్ధమవుతున్నారు. గత నెలలోనే ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఐదేళ్లనుంచి ప్రేమిస్తున్న నటి గీతాబస్రాను వివాహం చేసుకోగా.. కొన్నిరోజుల క్రితమే డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ప్రియురాలు హాజెల్ కీచ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవగా.. మరో యువ క్రికెటర్ కూడా త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడు.

ఇటీవల తన 30వ పుట్టినరోజు జరుపుకున్న మాజీ ఓపెనర్, కర్ణాటక ఆటగాడు రాబిన్ ఊతప్ప.. గత ఏడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తన చిన్ననాటి స్నేహితురాలు, టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్ తో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిపోయింది కూడా. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాబిన్.. తాము అతి త్వరలోనే పెళ్ళికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశాడు. గతకొన్ని రోజులుగా రంజీ ట్రోఫీ మ్యాచులకు దూరంగా వుండటంతో శీతల్ వద్ద పెళ్ళి ప్రస్తావన తీసుకురావడినికి సమయం దొరికిందని తెలిపాడు. ఇక పెళ్ళి ప్రస్తావన తీసుకురాగానే శీతల్ కూడా వెంటనే అంగీకారం తెలపడంతో నిశ్చితార్థ కార్యక్రమం వెంటనే జరిగిపోయినట్లు వెల్లడించాడు. ఎప్పటినుంచో తన ప్రేమను పెళ్ళిగా మార్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నానని, అయితే ఇప్పుడు వీలు కుదిరిందని రాబిన్ పేర్కొన్నాడు.

ఇదిలావుండగా.. తమ పెళ్ళికి సంబంధించిన ప్రపోజల్ కోసం రాబిన్ చాలాకాలం నుంచి నిరీక్షణ చేస్తున్న విషయం తనకు తెలియదని శీతల్ తెలిపింది. బహుశా గతంలోనే వెల్లడించి వుంటే అప్పుడే అంగీకరించేదాన్ని అని ఆ అమ్మడు చెబుతోందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదైతేనేం.. రాబిన్ పెళ్ళి ప్రస్తావన తీసుకురావడంతో తాను ఎంతో సంతోషించానని, వెంటనే నిశ్చితార్థానికి అంగీకారం తెలిపానని అమ్మడు ఆనందం వ్యక్తం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robin Uthappa  sheetal gautam  indian cricketers marriage  

Other Articles