New Zealand's Ross Taylor struck the highest Test score by a visiting batsman in Australia | Newzealand vs australia

Newzealand cricketer ross taylor hits record score by visiting test batsman in australia

ross taylor news, ross taylor record innings, ross taylor latest updates, australia vs newzealand, ross taylor record innings in australia, australia cricketers, newzealand cricketers,

Newzealand cricketer Ross Taylor hits record score by visiting Test batsman in Australia : New Zealand's Ross Taylor struck the highest Test score by a visiting batsman in Australia as the runs continued to flow in the second Test.

ఆస్ట్రేలియాలో అరుదైన ఘనత సాధించిన ‘కివీస్’ ప్లేయర్

Posted: 11/16/2015 05:36 PM IST
Newzealand cricketer ross taylor hits record score by visiting test batsman in australia

మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ తన అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఇంతవరకు ఏ న్యూజిలాండ్ క్రికెటర్ సాధించని అరుదైన ఘనతను సాధించి, ఆసీస్ ఆటగాళ్ళకు చుక్కలు చూపించాడు. సోమవారం నాల్గోరోజు ఆటలో భాగంగా దూకుడిగా ఆడిన టేలర్.. తృటిలో ట్రిపుల్ సెంచరీని కోల్పోయి (290;374 బంతుల్లో 43 ఫోర్లు) న్యూజిలాండ్ తరపున అత్యధిక స్కోరు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఆదివారం ఆటలో ఆసీస్ పై ఆస్ట్రేలియా గడ్డమీద డబుల్ సెంచరీ చేసిన ఆరో విదేశీ బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సాధించిన ఈ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. సుదీర్ఘంగా 567 నిముషాలపాటు క్రీజులో వుండి ఆసీస్ పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఇతను ప్రదర్శించిన ఆటతీరుకు మైదానంలో వున్న క్రీడాభిమానులు చప్పట్లతో హోరెత్తించారు.

టేలర్ కురిపించిన పరుగుల వర్షం కారణంగా ఆసీస్-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 559/9 వద్ద డిక్లేర్ చేయగా.. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 624 పరుగులు చేసింది. రాస్ టేలర్ డబుల్ సెంచరీతో పాటు, విలియమ్సన్(166;250 బంతుల్లో 24 ఫోర్లు) మరో శతకం చేయడంతో కివీస్ భారీ స్కోరు చేసింది. 510/6 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆట కొనసాగించిన కివీస్ మరో 114 పరుగులు చేసి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. కివీస్ ఇన్నింగ్స్ అనంతరం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్... నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి 63.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(131 బ్యాటింగ్), వోజస్(101 బ్యాటింగ్) సెంచరీలు నమోదు చేశారు. దీంతో ఈ మ్యాచ్ లో ఇప్పటివరకూ ఆరు సెంచరీలు నమోదయ్యాయి. తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలిచి 1-0తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ.. రెండో టెస్టులో సాగుతున్న ఉత్కంఠ పోరును చూస్తుంటే.. ఇది కచ్చితంగా డ్రాగా ముగుస్తుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఏదేమైనా.. ఈ రెండో టెస్టు మ్యాచ్ క్రీడాభిమానుల్ని బాగానే అలరించిందని చెబుతున్నారు.

ఇదిలావుండగా.. ఆస్ట్రేలియా గడ్డమీద భారీ స్కోరు చేసిన వారిలో ఇంగ్లండ్ కు చెందిన హట్టన్ 364 పరుగులతో ముందు వరుసలో ఉండగా, మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఫోస్టర్ 287 పరుగులతో తృతీయ స్థానంలోనూ,  భారత్ కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులతో నాల్గో స్థానంలో,  విండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారా 277 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు రాస్ టేలర్ 290 పరుగులు చేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ross taylor  australia vs newzealand  

Other Articles