i have increased my bowling load ishant sharma

Flare ups in sri lanka thing of past says ishant sharma

india vs south africa, ind vs sa, india south africa, india cricket team, sa vs ind, ind vs sa 2nd test, ishant sharma, ishant, ishant sharma india, cricket score, cricket news, cricket

Ishant Sharma, talking about changes in his technique, said he has primarily focussed on bowling more and a shorter run-up.

శ్రీలంక ఘటన గడిచిపోయిన జ్ఞాపకం..

Posted: 11/17/2015 06:00 PM IST
Flare ups in sri lanka thing of past says ishant sharma

శ్రీలంక ఘటన గడిచిపోయిన జ్ఞాపకమని టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగిన ఇషాంత్ శర్మ ఒక టెస్టు మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొని.. దక్షిణాఫ్రికాతో జరుగున్న రెండో టెస్టుకి జట్టులోకి వచ్చిన చేరాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీలంక ఘటనను వివరించారు. ఆ రోజు తన హెల్మెట్‌ను కొట్టమన్నట్లుగా దమ్మిక ప్రసాద్‌కు సైగ చేసిన దృశ్యం అందరికీ గుర్తుంది. ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందో ఇషాంత్ ఇప్పుడు వెల్లడించాడు.

‘ఒక ఓవర్లో బౌలర్ రెండు బౌన్సర్లు వేయవచ్చు. అయితే ప్రసాద్ నోబాల్ అవుతుందని తెలిసీ మూడోది వేశాడు. అంతకు ముందు నా బౌలింగ్‌లో అతని చేతికి బంతి తగిలింది కాబట్టి అతను కావాలనే అలా చేస్తున్నాడని నాకర్థమైంది. అయితే ఆ బౌన్సర్ వల్ల నాకు ఏమీ ఇబ్బంది అనిపించలేదు. దాంతో నా హెల్మెట్‌కు తగిలేలా బంతి విసరడం నీ వల్ల కాదు. నీ బౌలింగ్‌లో అంత వేగం లేదు అన్నాను. అప్పుడే మిగతా ఆటగాళ్లంతా చేరడంతో ఘటన పెద్దదైంది’ అని ఇషాంత్ గుర్తు చేసుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Lanka  Third Test  Ishant Sharma  Dammika Prasad  

Other Articles