DDCA Gets 'Conditional Nod' to Host India-South Africa Fourth Test

Delhi feroz shah kotla to host fourth test as scheduled

Feroz Shah Kotla stadium, ddca, bcci, delhi hc, india vs south africa, ind vs sa, Aravind kejriwal, aap government, delhi government, india south africa, india vs south africa 4th test, ind vs sa 4th test, india cricket, cricket news, cricket

Delhi HC appointed retired Delhi High court judge Justice Mukul Mudgal to "oversee" the arrangements for the match.

షెడ్యూలు మేరకే నాల్గవ టెస్టు.. వేదిక ఢిల్లీయే

Posted: 11/19/2015 07:22 PM IST
Delhi feroz shah kotla to host fourth test as scheduled

తమ ప్రభుత్వానికి వినోదపు పన్ను రూపంలో చెల్లించాల్సిన బకాయిలు చెల్లించని పక్షంలో ఢిల్లీలో జరగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా నాల్గవ టెస్టును అడ్డుకుంటామని దేశరాజధాని ఢిల్లీలోని అప్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంతో.. దిక్కుతోచని స్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు ఊరట లభించింది. దక్షిణాఫ్రికా-టీమిండియాల టెస్టు సిరీస్ లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో డిసెంబర్ మాసంలో జరుగనున్న చివరిదైన నాల్గో టెస్టుపై నెలకొన్నసందిగ్ధతకు దాదాపు తెరపడింది.  

మ్యాచ్ నిర్వహణకు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)ను ఆపొద్దంటూ ఢిల్లీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.  అయితే మ్యాచ్ నిర్వహణపై హామీగా కోటి రూపాయిలను ప్రభుత్వానికి చెల్లించాలిన హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఆ నగదు మొత్తంలో సగ భాగాన్ని అంటే రూ.50 లక్షలను రెండు వారాల లోపు డీడీసీఏ చెల్లించాలని తన తీర్పులో పేర్కొంది. ఆ మొత్తాన్ని చెల్లించడానికి డీడీసీఏ అంగీకారం తెలపడంతో తమ తదుపరి తీర్పు(నవంబర్ 27) వరకూ డీడీసీఏపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ బాదర్ దుర్రేజ్ అహ్మద్, సంజీవ్ సచ్చదేవ్ లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. దీంతో డిసెంబర్ మూడు నుంచి ఏడు వరకూ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో నాల్గో టెస్టు జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DDCA  Delhi high court  Feroz Shah Kotla stadium  bcci  India vs South Africa  

Other Articles