before tri series rahul dravid masterclass for india u-19

Rahul dravid readies u 19 india team for world cup

cricket, team india, rahul dravid, india, kolkata, afghanistan, bangladesh, under -19 Tri Series, India U-19 Team, U-19 World Cup

the Indian Under-19 boys gathered around their coach after playing a practice game among themselves. Rahul Dravid was giving a team talk and the youngsters were all ears.

ఉత్తమస్థాయికీ తీసుకెళ్లడమే నా బాధ్యత

Posted: 11/20/2015 06:24 PM IST
Rahul dravid readies u 19 india team for world cup

ఆటగాళ్లను మరింతగా రాటు దేల్చి వారిలో దాగివున్న ఆటను వెలికి తీయడం, వారిని ఉత్తమ స్థాయికి తీసుకెళ్లడమే తన బాధ్యత అని అండర్-19 క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. కాగా జట్టు ఎంపికలో తన పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం వరకే తన బాధ్యత. అంతేకానీ జట్టులోకి ఎవరు ఎంపిక కావాలనే దాంట్లో తన జోక్యం ఉండదని తేల్చిచెప్పాడు. ఎంపికైన వారి ఆటకు మెరుగులు దిద్ది మరో స్థాయికి తీసుకెళ్లేందుకు శాయశక్తులా కషి చేస్తానని ద్రవిడ్ తెలిపారు.
 
చిన్న వయస్సులోనే ఆటలో మెలకువలు నేర్చుకుని ఈ స్థాయికి వచ్చిన క్రీకెటర్లకు.. వారిలోని లోపాలను గుర్తించి మరింత ప్రతిభావంతులుగా తీర్చి దిద్దటమే తన భాధ్యతగా రాహుల్ చెప్పుకోచ్చాడు. ఇవాళ్లి నుంచి భారత జట్టు బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ అండర్-19 జట్లతో ముక్కోణపు సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14 వరకు బంగ్లాదేశ్‌లో జరిగే అండర్-19 ప్రపంచకప్‌కు ఈ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul dravid  cricket  India  bangladesh  under -19 Tri Series  

Other Articles