Pakistan need to develop safe venues to play cricket: Rajeev Shukla

India refused to play against pakistan at uae

BCCI, Cricket, rajiv shukla, safe venues, home serires, ICC, india pakistan bilateral series, IndVSPak uae series, Giles Clarke, India, Pakistan, PCB, Shashank Manohar, Sports, UAE

BCCI Senior official Rajiv Shukla has advised the Pakistan Cricket Board (PCB) to start developing a safe venue at home instead of in UAE.

ముందుగా సురక్షిత వేదికలను సిద్దం చేసుకోండి

Posted: 11/22/2015 07:56 PM IST
India refused to play against pakistan at uae

తమ హోమ్ సిరీస్‌లను యూఏఈలో ఆడించకుండా పాకిస్తాన్‌లోనే జరిపించేందుకు తగిన వేదికను తయారు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా పీసీబీకి సూచించారు. అలాగైతేనే భారత్... పాకిస్తాన్‌లో ఆడుతుందని తేల్చారు. ఐసీసీకి వారు భద్రతాపరంగా తగిన హామీనిస్తే లాహోర్‌లో ఆడేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఇలాగే తమ సొంత సిరీస్‌లను యూఏఈలో ఆడిస్తే క్రమక్రమంగా వారి దేశంలో క్రికెట్ క్షీణిస్తుందని వ్యంగోక్తులు విసిరారు.

నిజానికి లాహోర్‌ను సురక్షిత వేదికగా తయారు చేసుకోవచ్చని... స్టేడియానికి దగ్గరలోనే టీమ్ హోటల్‌ను నిర్మించి తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తే భారత్ అక్కడ ఆడేందుకు సిద్ధమేనని శుక్లా అన్నారు. ఆ తరువాత. అన్ని జట్లు పాక్ లో క్రికెట్ అడేందుకు సుముఖత వ్యక్తం చేస్తాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనికి ముందు వారు ఐసీసీకి భద్రత  విషయంలో హామీ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఇతర బోర్డులు కూడా పాక్‌లో ఆడేందుకు అభ్యంతరం వ్యక్తం చేయకూడదర్నారు. ఈసారికి వారు భారత్‌కు వచ్చి ఆడితే బావుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నష్టపరిహారం ఇవ్వడానికి కూడా తాము సిద్ధమే’ అని శుక్లా అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  pcb  rajiv shukla  safe venues  

Other Articles