I will let my performance do the talking says Irfan Pathan in an interview | Irfan pathan latest news

Irfan pathan wants his performance to do all the talking

irfan pathan news, irfan pathan baroda ranji match, team india cricketers, indian cricketers, india all rounders, irfan pathan interview, irfan pathan controversy, ranji trophy matches

Irfan Pathan wants his performance to do all the talking : Having made a remarkable return to the cricket field for his Ranji side Baroda, Indian all-rounder Irfan Pathan said that rather than speaking about international comeback he would let his performance do the talking.

‘మాటల్లో కాదు.. చేతల్లో చేసి నిరూపిస్తా’

Posted: 11/23/2015 11:37 AM IST
Irfan pathan wants his performance to do all the talking

2012లో భారత్ తరఫఉన చివరి వన్డే ఆడిన భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. ఆ తర్వాత జట్టులో కనిపించలేదు. కొన్నాళ్లు రియాలిటీ షోలు చేసుకుంటూ కాలం గడిపాడు. కానీ.. ఇన్నాళ్ళ తర్వాత తిరిగి రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు. వచ్చి రాగానే తనలో దాగిన సత్తా ఏంటో నిరూపించాడు. గతవారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ క్రికెటర్ 58 పరుగులు చేయడంతోపాటు 6 వికెట్లూ తీసి జట్టును గెలిపించాడు. ఈ విధంగా తన ప్రతిభను ఇర్ఫాన్ కనబరచడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. దీంతో.. భారతీయ జట్టులో ఇతని పునరాగమనానికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తన పునరాగమనం గురించి ఇర్ఫాన్ ను ప్రశ్నించగా... కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం ఎప్పుడనేది తన ప్రదర్శనే చెబుతుందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. దీని గురించి తాను మాట్లాడటం కంటే ప్రదర్శనపైనే ఎక్కువగా దృష్టిపెట్టానని చెప్పాడు. ‘పునరాగమనం గురించి ఎక్కువగా మాట్లాడి నా దృష్టిని మరల్చుకోలేను. ప్రస్తుతానికి బరోడా తరఫున నా సత్తా మేరకు రాణించాలని భావిస్తున్నా. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అలాగే నా అనుభవాన్ని జట్టు సభ్యులతో పంచుకుంటా. నా ప్రదర్శనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చే అంశాన్ని చెబుతుంది’ అని పఠాన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆల్‌రౌండర్ పాత్రపై ఎక్కువగా దృష్టిపెట్టానని చెబుతున్న ఇర్ఫాన్.. ఇందుకోసం ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే బాగా మెరుగుపడొచ్చన్నాడు. క్రీడాకారుడి జీవితంలో గాయాలు చాలా సాధారణం కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

ఇక కోహ్లీ కెప్టెన్సీ గురించి ఇర్ఫాన్ మాట్లాడుతూ.. గంగూలీ, ద్రవిడ్, ధోనిల నాయకత్వంతో పోలిస్తే అతని కెప్టెన్సీ భిన్నంగా ఉందని అన్నాడు. ప్రస్తుత టెస్టు జట్టుకు ఇది మంచి చేస్తుందన్నాడు. ‘ప్రతి కెప్టెన్ పనితీరు భిన్నంగా ఉంటుంది. నేను ఆడిన కెప్టెన్లందరూ భిన్నమైన వైఖరి కలిగి ఉన్నవారే. కెప్టెన్‌కు తగ్గట్టుగానే జట్టు స్పందన కూడా ఉండేది. ఓవరాల్‌గా జట్టును నడిపించడం మొత్తం నాయకుడిపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే విరాట్ టీమ్‌ను బాగా నడిపిస్తున్నాడు. లంకపై, దక్షిణాఫ్రికాపై అద్భుతంగా గెలిపించాడు. అతని కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా’ అని ఈ బరోడా పేసర్ వ్యాఖ్యానించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : irfan pathan  india cricket team  ranji trophy matches  

Other Articles