Darren Lehmann, Steve Smith wanted Mitchell Johnson to play on atleast in odi

Cricket australians wanted mitchell johnson to reconsider retirement

mitchell johnson, mitchell johnson australia, australia mitchell johnson, johnson australia, australia johnson, darren lehmann, australia new zealand, aus vs nz, nz vs aus, cricket news, cricket

Australia coach Darren Lehmann and skipper Steve Smith wanted Mitchell Johnson to extend his career but the seamer wasn't interested.

వారి విన్నపాన్ని తిరస్కరించిన జాన్సన్

Posted: 11/24/2015 06:20 PM IST
Cricket australians wanted mitchell johnson to reconsider retirement

అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవల వీడ్కోలు తీసుకున్న క్రికెటర్ పై జట్టు కెప్టెన్ సహా కోచ్ ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్నయాన్ని పునరాలోచించుకుని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆయన ఎవరో తెలుసా.. ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ జాన్సన్. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టు అనంతరం మిచెల్ ఆకస్మికంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్నిప్రకటించాడు. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ డారెన్ లీమన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ లు మిచెల్ మళ్లీ ఆడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆ క్రమంలోనే రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కూడా మిచెల్ కు విన్నవించినట్లు వారు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆసీస్ జట్టులో పేస్ బౌలింగ్ లేమి కనబడుతోందని దాన్నిభర్తీ చేయడానికైనా తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని తాజాగా జాన్సన్ ను లీమన్, స్మిత్ లు కోరారు. కనీసం వన్డేల్లోనైనా ఆడాలని మిచెల్ కు విజ్ఞప్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. 'మిచెల్ తిరిగి ఆడితే బాగుంటుంది. రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించుకుని జట్టులో కొనసాగితే మంచిదనేది మిచెల్ ను కోరాం. కానీ అతను అందుకు సుముఖంగా లేడని స్మిత్ తెలిపాడు. .కేవలం ఇంటి దగ్గర కూర్చుని ఆసీస్ మ్యాచ్ లను చూడాలని అనుకుంటున్నానని చెప్పాడు' ఈ మేరకు కోచ్ లీమన్, కెప్టెన్ స్మిత్ లు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mitchell Johnson  Steve Smith  darren lehmann  cricket australia  

Other Articles