Virat Kohli hopes day-night Test experiment works well

Day night tests could be exciting says virat kohli

australia vs new zealand 2015-16, nagpur, test cricket, day and night test, virat kohli, Australia, New Zealand, india vs south africa, india vs sa, ind vs sa, india cricket team, india cricket, cricket india, virat kohli, kohli, r ashwin, ashwin, cricket news, cricket

India captain Virat Kohli on welcomed the experiment of day-night Test cricket that's set to take place when Australia meet New Zealand in the third and final game of their current series in Adelaide from November 27.

ఆ మ్యాచ్ ను స్వాగతించిన విరాట్ కోహ్లీ..

Posted: 11/24/2015 06:40 PM IST
Day night tests could be exciting says virat kohli

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ క్రికెట్ ల మధ్య నవంబర్ 27నుంచి అడిలైడ్ లో జరుగనున్న తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ను టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్వాగతించాడు. టెస్టులను డే అండ్ నైట్ మ్యాచ్ లుగా నిర్వహిస్తే సాంప్రదాయ క్రికెట్ కు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నాడు. మంగళవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కోహ్లీ.. డే అండ్ నైట్ టెస్టు నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ పెద్దలు తీసుకున్ననిర్ణయం నిజంగా అద్భుతమైనదిగా అభివర్ణించాడు. ఇది ఓ మంచి ప్రయోగంగా కోహ్లి పేర్కొన్నాడు.

కాగా, ఆ మ్యాచ్ ల కు వాడే పింక్ బాల్ పై కోహ్లి కాస్త అనుమానం వ్యక్తం చేశాడు. కొంతమంది ఆటగాళ్లు తెలిపిన సమాచరం మేరకు డే అండ్ నైట్ టెస్టులకు పింక్ బంతి సరైనది కాదని పేర్కొంటున్నట్లుకోహ్లి తెలిపాడు. పగలు, రాత్రి పింక్ బాల్ తో మ్యాచ్ నిర్వహణకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. సూర్యుడు అస్తమించే సమయంలో పింక్ బంతితో ఆడటం కష్టతరంగా మారే అవకాశం ఉందని కోహ్లి ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat kohli  India  Australia  New Zealand  Day and Night Test  

Other Articles