టీమీండియా యువ జట్టు, అండర్ 19 ముక్కోణపు సిరీస్ లో వరుస విజయాలతో దుమ్మురేపుతూ ముందుకు సాగుతోంది. అటు బంగ్లాదేశ్, ఇటు అష్ఘనిస్థాన్ యువ జట్లపై విజయాన్ని నమోదు చేసుకున్న భారత యువ జట్టు... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సుందర్ వాషింగ్టన్ (75 బంతుల్లో 50; 6 ఫోర్లు; 2/25) ఆల్‌రౌండ్ ఆటతీరును ప్రదర్శించడంతో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి ముందుంగా బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, గత మ్యాచ్ లో తప్పిదాలను మెరుగుపర్చుకుని టీమిండియాపై విజయానికి పన్నిన వ్యూహాలను యువభారత్ ఆటగాళ్లు చేధించారు. బంగ్లాదేశ్ చేసిన స్కోరును ఒకధశలో ఒత్తడికి గురై నాలుగు విక్కెట్లను చేజార్చుకున్న టీమిండియా.. కోలుకుని బాగా రాణించడంతో విజయాన్ని నమోదు చేసుకుంది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 222 పరుగులు చేసింది. హసన్ మిరాజ్ (90 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. సైఫ్ హసన్ (33), సైఫుద్దీన్ (30) ఓ మాదిరిగా ఆడారు.
ఆ తర్వాత భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి నెగ్గింది. రిషబ్ పంత్ (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. అమన్‌దీప్ (41), ఇషాన్ కిషన్ (24), విరాట్ సింగ్ (21) తలా కొన్ని పరుగులు జత చేశారు. పంత్, ఇషాన్‌లు 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే బంగ్లా బౌలర్ల ధాటికి ఓ దశలో భారత్ 116 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ దశలో సుందర్, అమన్‌దీప్ ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more