faf du plessis makes record in getting a single after huge number of balls

Du plessis grafting frustrates india

India vs south africa,Live Streaming Information,virat kohli,ajinkya rahane,Rahul Dravid,Sunil Manohar Gavaskar,Ajinkya Rahane,South Africa in India Series, 2015,Cricket,4th test,Watch live,India vs south africa live score,Ind vs SA,4th test live,Day 5 live score,Ind vs sa live

du Plessis has continued the vigil. India face a hard task as they look to take the remaining wickets.

పరమ జిడ్డు ఆటగాడిగా డూప్లిసిస్ రికార్డు..

Posted: 12/07/2015 04:45 PM IST
Du plessis grafting frustrates india

భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టును ఎట్టి పరిస్థితుల్లో డ్రాగా ముగించాలని చూస్తున్న దక్షిణాఫ్రికా, టెస్టు క్రికెట్ చరిత్రలో ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనంతగా డిఫెన్స్ కు పరిమితమైంది. ఎలాగైనా వికెట్లకు అతుక్కుపోయి టెస్టు సిరీస్ లో ఒక్కటైనా డ్రా చేసుకుందామని తీవ్రంగా యత్నించారు. అసలు పరుగులేమీ వద్దన్నట్లు వ్యవహరించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి పరుగును చేసేందుకు అత్యధిక బంతులను తీసుకున్న ఆటగాడిగా డుప్లెసిస్ సరికొత్త రికార్డును సృష్టించాడు.

ఈ ఉదయం ఆమ్లా అవుట్ అయిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన డుప్లెసిస్ అత్యంత జిడ్డు ఆటగాడిగా నిలిచి తొలి పరుగు చేసేందుకు 53 బంతులను తీసుకున్నాడు. నిన్న ఆమ్లా తొలి పరుగు చేసేందుకు 45 బంతులాడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ ఉదయం వరకూ ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు ఎక్ స్టీన్ పేరిట ఉంది. అతను తన తొలి పరుగుకు 46 బంతులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి ఈ రికార్డు డుప్లెసిస్ ఖాతాలోకి చేరిపోయింది.

సౌతాఫ్రికా జట్టులో స్పిన్‌ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొగలిగిన బ్యాట్స్‌మెన్లు నలుగురే . ఆ నలుగురిలో డుమిని తప్ప మిగిలిన ముగ్గురూ తమ ప్రతిభనంతా ప్రదర్శించారు.  ఆ ప్రతిభ పరుగులు రాబట్టడానికి..వారి పరాజయం నుంచి తప్పించడానికి ఉపయోగపడలేకపోయినా భారత్ విజయాన్ని మాత్రం ఆలస్యం చేయగలిగింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 143.1 ఓవర్లు కొనసాగితే అందులో ఈ ముగ్గురూ కలిసి 106 ఓవర్లు ఆడారంటే ఎంత జిడ్డాట ఆడారో అర్ధం చేసుకోవచ్చు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  south africa  duplesis  ferozshah kotla stadium  

Other Articles