Ben Stokes blasts brilliant 258 as England make South Africa suffer

2nd test late stokes burst gives england the edge

england vs south africa, south africa vs england, south africa cricket, cricket south africa, england cricket, cricket england, eng vs aus, aus vs eng, ben stokes, johnny braistow, eng vs sa score, cricket score, cricket news, cricket

Ben Stokes hits second fastest double ton, Jonny Bairstow hits maiden Test ton as England declare on 629/6; South Africa 141/2 - See more at: http://indianexpress.com/article/sports/cricket/england-in-control-after-ben-stokes-jonny-bairstow-record-stand-against-south-africa/#sthash.65yMtPgF.dpuf

బెన్ స్టోక్స్ విరవిహారం.. ఇంగ్లాండ్ భారీ స్కోరు

Posted: 01/03/2016 05:57 PM IST
2nd test late stokes burst gives england the edge

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తన సహజసిద్ధమైన దూకుడును ప్రదర్శించిన స్టోక్స్ (204 బ్యాటింగ్:167 బంతుల్లో 26 ఫోర్లు, 7 సిక్సర్లు) డబుల్ సెంచరీ నమోదు చేశాడు. తొలి సెంచరీ చేసే క్రమంలో దాదాపు వంద స్ట్రైక్ రేట్ నమోదు చేసిన స్టోక్స్.. అదే ఊపును  కొనసాగించి రెండో శతకాన్ని సాధించాడు. బెన్ స్టోక్స్ 163 బంతుల్లో  ద్విశతకాన్ని సాధించడంతో  రెండో అత్యుత్తమ వ్యక్తిగత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో నాథన్ ఆస్టల్ 153 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.
     
ప్రస్తుతం స్టోక్స్ కు జతగా బెయిర్ స్టో(95 బ్యాటింగ్;139 బంతుల్లో 11 ఫోర్లు) క్రీజ్ లో ఉన్నాడు.  దీంతో రెండో రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 513 పరుగులతో పటిష్ట స్థితికి చేరింది.  అంతకుముందు 317/5 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఈ జోడి 290 పరుగుల అజేయ భాగస్వామ్యంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో హేల్స్ (60), రూట్ (50)  అర్ధ సెంచరీలు చేయగా, కాంప్టన్ (45) ఫర్వాలేదనిపించాడు.దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడాకు మూడు వికెట్లు దక్కగా, మోర్నీ మోర్కెల్, క్రిస్ మోరిస్ లకు తలో వికెట్ దక్కింది. స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో సఫారీలు ఇప్పటికే 0-1 తేడాతో వెనుకబడిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆధిక్యంలో కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ben stokes  cricket  kagiso rabada  morne morkel  south africa  south africa vs england 2015-16  

Other Articles