తొలి టి20లో ఘోర ఓటమికి టీమిండియా సేన ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ 20లో శ్రీలంకను కసితీరా ఉతికి ఆరేశారు. ఫలితంగా 69 పరుగులతో ధోని సేన ఘన విజయం సాధించింది. కెప్టెన్ ధో్ని సొంత గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఒపనర్లు శిఖర్ ధావన్ (25 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరుకు, రోహిత్ శర్మ (36 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్సర్) అండగా నిలవడంతో... రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా 69 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రైనా (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది. కపుగెడెర (27 ) టాప్ స్కోరర్. చండిమల్ (31), షనక (27) మోస్తరుగా ఆడారు. గుణతిలక (2), దిల్షాన్ (0), ప్రసన్న (1)లు స్వల్ప వ్యవధిలో అవుట్‌కావడంతో లంక 16 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. చండిమల్, కపుగెడెరా నిలకడగా ఆడినా నిష్పల్పంగా మారింది.
కాగా సిరివర్ధన (28 నాటౌట్), షనక భారీ షాట్లతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. పెరీరా (0), సేననాయకే (0), చమీరా (0)లు అవుట్ కావడంతో లంకకు ఓటమి తప్పలేదు. అశ్విన్ 3, నెహ్రా, జడేజా, బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు. 22 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరి టి20 ఆదివారం వైజాగ్‌లో జరుగుతుంది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) చమీరా 43; ధావన్ (సి) చండిమల్ (బి) చమీరా 51; రహానే (సి) దిల్షాన్ (బి) సేననాయకే 25; రైనా (సి) చమీరా (బి) పెరీరా 30; హార్దిక్ పాండ్యా (సి) గుణతిలక (బి) పెరీరా 27; ధోని నాటౌట్ 9; యువరాజ్ (సి) సేననాయకే (బి) పెరీరా 0; జడేజా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196.
వికెట్ల 1-75; 2-122; 3-127; 4-186; 5-186; 6-186.
బౌలింగ్: రజిత 4-0-45-0; పెరీరా 3-0-33-3; సేననాయకే 4-0-40-1; చమీరా 4-0-38-2; ప్రసన్న 3-0-21-0; సిరివర్ధన 1-0-6-0; షనక 1-0-12-0
శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) ధోని (బి) నెహ్రా 2; దిల్షాన్ (స్టంప్) ధోని (బి) అశ్విన్ 0; ప్రసన్న (సి) యువరాజ్ (బి) నెహ్రా 1; చండిమల్ (స్టంప్) ధోని (బి) జడేజా 31; కపుగెడెర (సి) పాండ్యా (బి) జడేజా 32; సిరివర్ధన నాటౌట్ 28; షనక (సి) రైనా (బి) అశ్విన్ 27; పెరీరా (సి) రహానే (బి) అశ్విన్ 0; సేననాయకే ఎల్బీడబ్ల్యు (బి) బుమ్రా 0; చమీరా (బి) బుమ్రా 0; రజిత నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127.
వికెట్లు: 1-2; 2-3; 3-16; 4-68; 5-68; 6-116; 7-117; 8-119; 9-119. బౌలింగ్: అశ్విన్ 4-0-14-3; నెహ్రా 3-0-26-2; యువరాజ్ 3-0-19-0; జడేజా 4-0-24-2; రైనా 2-0-22-0; బుమ్రా 3-0-17-2; పాండ్యా 1-0-5-0.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more