dhonis unique feat first skipper to lead a team to 30 wins in t20 cricket

Ms dhoni becomes the first captain to win 30 twenty20 international matches

India vs Sri Lanka 2016, ms dhoni, ms dhoni india, T20 captaincy, dhoni t20 captaincy record,India vs Sri Lanka 2016,Indian Cricket,Sri Lanka Cricket, india ms dhoni, dhoni india, india dhoni, dhoni india cricket, Cricket news

India's Mahendra Singh Dhoni became the first skipper to lead a team to 30 wins in Twenty20 Internationals after the win against Sri Lanka in the Ranchi match.

పోట్టి ఫార్మెట్ క్రికెట్ లో ధోని అరుదైన రికార్డు..

Posted: 02/14/2016 03:54 PM IST
Ms dhoni becomes the first captain to win 30 twenty20 international matches

ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన టీమిండియా పరిమిత ఓవర్ల సారథి మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం రాంచీలో శ్రీలంకతో జరిగిన రెండో టీ 20లో టీమిండియా విజయం సాధించిన అనంతరం ధోని తన అంతర్జాతీయ టీ 20 కెప్టెన్సీ రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. ఇప్పటివరకూ 56  టీ 20 లకు కెప్టెన్ వ్యవహరించిన ధోని పొట్టి ఫార్మెట్ లో తన విజయాల సంఖ్యను 30కు పెంచుకున్నాడు. తద్వారా టీ 20ల్లో ఒక జట్టుకు అత్యధిక విజయాలను అందించిన  కెప్టెన్ గా అద్వితీయ ఘనతను ధోని సొంతం చేసుకున్నాడు.
 
ధోని సారథ్యంలో టీమిండియా 24 మ్యాచ్ల్లో ఓడిపోగా, మరొక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ధోని ట్వంటీ 20 విజయాల రేటు 55.45 శాతంగా ఉంది. ధోని తరువాత స్థానాల్లో ఫోర్ట్ ఫీల్డ్(ఐర్లాండ్) 23 విజయాలతో  రెండో స్థానంలో ఉండగా, డారెన్ సామీ(వెస్టిండీస్) 22 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు. షాహిద్ ఆఫ్రిది(పాకిస్తాన్) 16 విజయాల్ని సొంతం చేసుకుని నాల్గో స్థానంలో  ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  T20 captaincy  record  india  India vs Sri Lanka 2016  

Other Articles