అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంటు ఆరంభం నుంచి అత్యుత్తమ ప్రతిభతో రాణించిన యువ భారత్ జట్టు.. ఫైనల్ మ్యాచ్ లో మోకరిల్లింది. బంగ్గాదేశ్ లోని ఢాకా స్టేడియం వేదికగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా యువజట్టు వెస్టిండీస్ ఎదుట బొక్కబోర్లా పడింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తుదిపోరులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. భారత్ విసిరిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన విండీస్ ఇంకా మూడు బంతులుండగా విజయం సాధించి తొలిసారి కప్‌ను దక్కించుకుంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ కు ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు గిడ్రాన్ పోప్(3), ఇమ్లాక్(15) పెవిలియన్‌కు చేరారు. అనంతరం హేట్‌మైర్(23),స్పింగర్(3), గూలీ(3) కూడా అవుట్ కావడంతో విండీస్ 77 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ పై భారత్ పట్టు సాధించినట్లు కనబడింది.
కాగా, ఆ తరుణంలో కార్టీ(52నాటౌట్), కీమో పాల్(40) సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో విండీస్ 49.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని వరల్డ్ కప్‌ను అందుకుంది. దీంతో నాల్గో సారి కప్‌ను దక్కించుకుందామనుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. 2000, 08, 12 సంవత్సరాల్లో వరల్డ్ కప్ ను గెలుచుకుని రికార్డు టైటిల్ పై కన్నేసిన యువ భారత్ పేలవ ప్రదర్శన కారణంగా పరాజయం పాలైంది. ఈ టోర్నీలో భారత్ కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. కాగా, అండర్ 19 వరల్డ్ కప్ లో రెండోసారి ఫైనల్ కు చేరిన విండీస్ అందరీ అంచాలను తల్లక్రిందులు చేసి తమలోని ప్రతిభకు కొదవలేదని నిరూపించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన యువ భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటయ్యింది. భారత ఆటగాళ్లలో సర్పరాజ్ ఖాన్(51), బాథమ్(21), లామ్రోర్(19) మినహా మిగతా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేదు. ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో భారత స్వల్ప స్కోరుకే పరిమితమైంది. విండీస్ బౌలర్లలో జోసఫ్, జాన్‌లకు తలో మూడు వికెట్లు సాధించగా, కీమో పాల్‌కు రెండు వికెట్లు లభించాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more